ఆ డీఎస్సీ అభ్యర్థులకు వెంటనే పోస్టింగులు ఇవ్వండని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. పాఠశాల విద్యాశాఖపై క్యాంపు కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్.జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ, వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభం అయ్యే నాటికి ఐఎఫ్పి ప్యానెల్స్ ఏర్పాటు కావాలని ఆదేశించారు.
నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ వద్దన్న సీఎం జగన్… ఈ డిజిటల్ స్క్రీన్లు వల్ల విద్యార్థులకు అత్యుత్తమ బోధన అందాలన్నారు. పిల్లలు అందరివద్దా డిక్షనరీలు ఉన్నాయా? లేవా? మరోసారి పరిశీలన చేయాలన్న సీఎం…లేని పిల్లలు అందరికీ డిక్షనరీలు ఇవ్వాలని తెలిపారు.
వచ్చే విద్యా సంవత్సరం విద్యాకానుక కోసం అన్నిరకాల ఏర్పాట్లు చేసుకోవాలని సీఎం ఆదేశించారు. డీఎస్సీ 98 అభ్యర్థులకు పోస్టింగులు త్వరగా ఇవ్వాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు.గోరుముద్ద నాణ్యతను నిరంతర పరిశీలన చేయాలన్న సీఎం జగన్.. అన్ని స్కూళ్లు, అంగన్వాడీలకు సార్టెక్స్ ఫోర్టిఫైడ్ బియ్యం మాత్రమే సరఫరా చేయాలని తెలిపారు.