పోస్ట్ ఆఫీస్ ఎన్నో రకాల స్కీమ్స్ ని ఇస్తోంది. సురక్షితమైన పెట్టుబడి పెట్టాలనుకుంటే పోస్టాఫీసు ని ఎంచుకోవడం మంచిది. చాలా మంది పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ లో డబ్బులు పెడుతూ వుంటారు. కొన్ని సంవత్సరాలలో మంచి లాభాలను పోస్ట్ ఆఫీస్ ద్వారా పొందొచ్చు. ముఖ్యంగా పోస్టాఫీసు లోని చిన్న పొదుపు పథకాల లో డబ్బులు పెట్టడం వలన మంచి ప్రాఫిట్ వస్తుంది.
పోస్ట్ ఆఫీస్ అందించే స్కీమ్ లో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఒకటి. ఇది మిమ్మల్ని లక్షాధికారిని చేస్తుంది. ఇక దీని కోసం పూర్తి వివరాలని చూస్తే.. 7.1 శాతం వడ్డీ రేటును ఈ స్కీమ్ కింద అందిస్తోంది. ఈ స్కీమ్ మెచ్యూరిటీ వ్యవధి వచ్చేసి 15 సంవత్సరాలు. అయితే ఈ స్కీమ్ ని కావాలంటే మీరు ఇంకో 5 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు.
15 సంవత్సరాల వ్యవధి ముగిసే సమయానికి ఫండ్ అవసరం లేకపోతే మీరు దానిని తీసుకెళ్లవచ్చు. చక్రవడ్డీ ప్రయోజనాన్ని కూడా దీనితో పొందవచ్చు. ప్రతి సంవత్సరం గరిష్టంగా రూ.1.50 లక్షలు పెట్టుబడి ని ఈ స్కీమ్ కింద పెట్టచ్చు. ఏడాదిలో రూ.1.50 లక్షలు డిపాజిట్ చెయ్యకుండా కావాలంటే నెలకి రూ.12500 కూడా పెట్టవచ్చు. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా పొందొచ్చు.
ఈ స్కీమ్ లో మీరు రూ. 22.5 లక్షలు పెట్టుబడి పెడితే రూ.18 లక్షల వడ్డీ వస్తుంది. మెచ్యూరిటీ 15 ఏళ్లలో ఉంటుంది. రోజుకు రూ.416 ఆదా చేసుకోవాలి. 15 సంవత్సరాలలో మొత్తం పెట్టుబడి రూ.22.50 లక్షలు అవుతాయి. వార్షిక వడ్డీ రేటు 7.1 శాతం వస్తుంది. మెచ్యూరిటీ మొత్తం రూ. 40.70 లక్షలు అవుతుంది. ఇందులో రూ. 18.20 లక్షల వడ్డీ వస్తుంది. రూ.12,500 చొప్పున 25 ఏళ్ల పాటు డిపాజిట్ చేస్తే రూ.40.70 లక్షల మొత్తం రెట్టింపు వస్తుంది. 25 సంవత్సరాలలోరూ.37.50 లక్షలు వస్తాయి. వడ్డీ ప్రయోజనంతో రూ. 62.50 లక్షల వడ్డీ లభిస్తుంది. ఇలా ఈ స్కీమ్ తో మెచ్యూరిటీపై రూ.1.03 కోట్లు వస్తాయి.