రాజధానిపై మరో బిల్లు తో వస్తాం : జగన్‌ సంచలన ప్రకటన

మూడు రాజధానుల అంశంపై ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.మూడు రాజధానులపై మరో బిల్లు తో తిరిగి వస్తామని ప్రకటించారు సీఎం జగన్. మూడు రాజధానులపై మరింత మెరుగైన బిల్లు తీసుకువస్తామని… మళ్లీ పూర్తి సమగ్రమైన వికేంద్రీకరణ బిల్లుతో వస్తామని జగన్‌ ప్రకటించారు.

మూడు రాజధానులపై మరింత మెరుగైన బిల్లు తీసుకోస్తామన్నారు జగన్‌. పదేళ్లు పోతే అది ఆరేడు లక్షల కోట్లు అవుతుందన్నారు. అమరావతి ప్రాంతంలోనే తన ఇల్లు ఉందని చెప్పారు సీఎం జగన్. తనకు ఈ ప్రాంతమంటే నాకు ఇష్టమన్నారు. ఒకప్పుడు రాజధానిగా కర్నూలు ఉండేదని… గుంటూరు లో హై కోర్టు ఉండేదని గుర్తు చేశారు సీఎం జగన్‌. అమరావతి ప్రాంతంపై నాకు ఎలాంటి వ్యతిరేకత లేదని వెల్లడించారు. రాజధాని నిర్మాణానికి రూ. లక్ష కోట్లు అవసరమవుతాయని లెక్కలేశారు. విశాఖలో కొద్దిగా వ‌స‌తులు పెంచితే హైద‌రాబాద్ లాంటి న‌గ‌రంలో పోటీ ప‌డుతుందని… ఇక్క‌డి ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల కోసం శాస‌న రాజ‌ధాని.. క‌ర్నూలుకు న్యాయ రాజ‌ధాని ఇచ్చామని వెల్లడించారు.