తెలంగాణలో అధికార టీఆర్ఎస్‌కు ఇప్పుడుప్పుడే గడ్డు కాలం మొదలవుతున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటివరకు కారు ఫుల్‌గా నడిచింది…అసలు కారులో పట్టనంతగా నాయకులని చేర్చుకున్నారు. ఇప్పుడే అదే రివర్స్ అయ్యేలా ఉంది. కారులో సీటు లేనివారు నిదానంగా కారు దిగేసే ప్రయత్నాలు చేయడం మొదలుపెట్టారు. 2014, 2018 ఎన్నికల్లో గెలిచి రెండుసార్లు అధికారంలోకి రావడంతో ఇతర పార్టీల్లోనే నాయకులు…ఎడాపెడా కారు పార్టీలోకి వచ్చారు. కేసీఆర్ సైతం…ఇతర పార్టీలని దెబ్బతీయాలనే లక్ష్యంతో…నాయకులు చేర్చుకున్నారు.
అయితే మొన్నటివరకు అంతా బాగానే ఉంది..కానీ ఇటీవల కారు రివర్స్ అవుతుంది. ఒకవైపు బీజేపీ, మరొకవైపు కాంగ్రెస్‌లు పుంజుకుంటున్నాయి. దీంతో కారులో ఖాళీ లేని వారు ఆ రెండు పార్టీల వైపు చూస్తున్నారు. ఇప్పటికే కొందరు పరిస్తితులని బట్టి కారు దిగేయడానికి రెడీ అయ్యారు. ఇదే క్రమంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సైతం టీఆర్ఎస్‌ని వీడే అవకాశాలు ఉన్నాయని ప్రచారం చేస్తుంది. ఖమ్మం జిల్లాలో సీనియర్ నేతగా ఉన్న పొంగులేటికి కారులో ప్రాధాన్యత తగ్గింది.
2014 ఎన్నికల్లో ఖమ్మం బరిలో నిలబడి వైసీపీ నుంచి ఎంపీగా గెలిచిన పొంగులేటి…ఆ తర్వాత తెలంగాణలో వైసీపీకి ప్రాధాన్యత తగ్గడంతో పొంగులేటి టీఆర్ఎస్‌లోకి వచ్చేశారు. అయితే 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఈయనకు సీటు దక్కలేదు. టీడీపీ నుంచి వచ్చిన నామా నాగేశ్వరరావు టీఆర్ఎస్‌లోకి వచ్చి ఖమ్మం ఎంపీ సీటు దక్కించుకుని విజయం సాధించారు. అయితే పొంగులేటి సీటు త్యాగం చేయడంతో ఆయనకు రాజ్యసభ లేదా ఎమ్మెల్సీ వస్తుందని అనుకున్నారు.
కానీ ఇంతవరకు పొంగులేటికి ఏ పదవి రాలేదు. తాజాగా ఎమ్మెల్సీ స్థానాల భర్తీ కూడా ముగిసింది. స్థానిక సంస్థల కోటాలో ఖమ్మం ఎమ్మెల్సీ సీటుని తాతా మధుకు కేటాయించారు. దీంతో పొంగులేటికి హ్యాండ్ ఇచ్చినట్లైంది. ఇక పొంగులేటికి ఏదొక పదవి గానీ, సీటు గానీ వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో ఆయన పరిస్తితులని బట్టి కారు దిగేసి వేరే పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.