హైదరాబాద్ అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోవాలి— మంత్రి బుగ్గన

-

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సర్కారు మూడు రాజధానుల విషయంలో వెనక్కి తగ్గింది. మూడు రాజధానుల ఉపసంహరణ బిల్లును ఏపీ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఆర్గిక మంత్రి బుగ్గన మూడు రాజధానుల ఉపసంహరణ బిల్లను అసెంబ్లీలో ప్రవేశపెట్టి… పరిపానల వికేంద్రీకరణ గురించి ప్రసంగించారు. హైదరాబాద్ అనుభవాలను నుంచి పాఠాలు నేర్చుకోవాలని ఆయన అన్నారు. తెలంగాణ ఏర్పాటు అనంతరం ఎదురైన చేదు అనుభవాన్ని గమనించి వికేంద్రీకరణ చాలా ముఖ్యమని అసెంబ్లీలో వివరించారు.

కేంద్ర ప్రభుత్వ సంస్థలే ఏ రాష్ట్రానికైనా గ్రోత్ ఇంజన్ల లాగా పనిచేస్తాయని బుగ్గన అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అభివ్రుద్ది కోసం కేంద్రం IDPL, ECIL, BHEL, NFC, NMDC, HCL, DRDO వంటి సంస్థలను హైదరాబాద్ లో ఏర్పాటు చేశారని తెలిపారు. దీని వల్లే హైదరాబాద్ అభివ్రుద్ది చెందిదని చెప్పారు. ఉత్తర్ ప్రదేశ్ కు  BHEL ఇస్తే వారు లక్నోను కాదని హరిధ్వార్ లో ఏర్పాటు చేశారు. ఇదే విధంగా తమిళ నాడుకు BHEL ఇస్తే వారు కూడా దీన్ని రాజధాని చెన్నైని కాదని రాష్ట్రానికి దక్షిణాన ఉన్న ట్రిచిలో పెట్టారు. ఇప్పడు ట్రిచి పెద్ద నగరంగా అభివ్రుద్ధి చెందిందని బుగ్గన అసెంబ్లీలో తెలిపారు. కాబట్టే పరపాలన వికేంద్రీకరణ తప్పనిసరి అని శివరామక్రిష్ణన్ కమిటీ చెప్పిందని బుగ్గన అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news