ఆరోగ్య శ్రీ కార్డు దారులకు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి శుభవార్త చెప్పారు. రాష్ట్రంలో 90 శాతం మందికి ఆరోగ్య శ్రీ సేవలు అందిస్తున్నామని అసెంబ్లీలో చెప్పారు సీఎం జగన్. ఆరోగ్య శ్రీ ద్వారా పొరుగు రాష్ట్రాల్లో కూడా వైద్యం అందిస్తున్నామని…. వైద్యం ఖర్చు రూ. 1000 దాటితే ఆరోగ్య శ్రీ వర్తింపు ఉంటుందని ప్రకటన చేశారు సీఎం జగన్. ప్రస్తుతం ఆరోగ్య శ్రీ పరిధిలో 2,446 చికిత్సలు కొనసాగుతున్నట్లు ప్రకటన చేశారు సీఎం వైయస్ జగన్.
ఆరోగ్యరంగం అభివృద్ధిపై అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ సందర్బంగా జగన్ మాట్లాడారు. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చిన ఏకైక ప్రభుత్వమిదని… ప్రతిఒక్క ప్రాణాన్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నామన్నారు సీఎం జగన్. కరోనాపై యుద్ధంలో 31 సార్లు ఇంటింటి సర్వే చేశామని… కోవిడ్ వల్ల అనాథలైన పిల్లలకు రూ.10 లక్షలు డిపాజిట్ చేసిన తొలి ప్రభుత్వమిదని సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు సీఎం జగన్. ఇక ముందు కూడా పేద ప్రజలకు తోడుగా నిలుస్తామని స్పష్టం చేశారు సీఎం జగన్.