ఏపీ గవర్నర్ తో సీఎం జగన్ భేటీ… టిడిపి పై ఫిర్యాదు !

అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ ను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కలిశారు. కాసేపటి క్రితమే రాజ్ భవన్ లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను కలిశారు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ముందుగా గవర్నర్ దంపతులతో సమావేశమయ్యారు ముఖ్యమంత్రి దంపతులు.

అనంతరం గవర్నర్ విశ్వభూషణ్ తో సీఎం జగన్ ఏకాంతo గా సమావేశం అయ్యారు. నవంబర్ 1 వైఎస్ఆర్ లైఫ్ టైమ్ అఛీవ్ మెంట్ అవార్డుల ప్రధానోత్సవం జరగనున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావాలని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ను ఆహ్వానించారు సీఎం జగన్ మోహన్ రెడ్డి.

అలాగే… తెదేపా కార్యాలయాల పై దాడులకు దారి తీసిన అంశాలను గవర్నర్ కు వివరించారు సీఎం జగన్. తనపట్ల తెలుగుదేశం పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలను గవర్నర్ కు వివరించారు. అలాగే తాజా రాజకీయ పరిణామాలపై గవర్నర్ తో చర్చించారు సీఎం జగన్. దాదాపు 45 నిమిషాలు పాటు జరిగిన సీఎం-గవర్నర్ సమావేశం… కాసేపటి క్రితమే ముగిసింది.