ఏపీ అప్పులపై సీఎం జగన్ ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. అప్పుల్లో చూసినా.. గత ప్రభుత్వంతో పోలిస్తే.. అప్పులు తక్కువే సీఏజీ ప్రకారమనని వివరించారు. ఇప్పుడు పథకాలు ఎందుకు అందుతున్నాయంటే.. ఎక్కడా లంచాలు లేవు, వివక్షలేదు, అవినీతి లేదని తేల్చి చెప్పారు సీఎం జగన్. ప్రతి కుటుంబానికీ కనీసం 3–4 పథకాలు అందుతున్నాయని.. అప్పుడూ అదే బడ్జెట్.. ఇప్పుడూ అదే బడ్జెట్…కానీ ఈ పథకాలు గత ప్రభుత్వంలో ఎందుకు లేవు ? అని నిలదీశారు.
జగనన్న తోడు ద్వారా లబ్ధి పొందినవారిలో 80శాతం మంది అక్క చెల్లెమ్మలే ఉన్నారన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్క చెల్లెమ్మలే మరో 80శాతం మంది ఉన్నారని.. ఇది మహిళా సాధికారితకు, సామాజిక న్యాయానికి కూడా నిదర్శనమని వెల్లడించారు. గత ప్రభుత్వంలో ఇలాంటి కార్యక్రమాలు జరగలేదని.. చిరువ్యాపారులకు తోడుగా నిలవాలన్న ఆలోచన ఏరోజూ కూడా గత ప్రభుత్వంలో చేయలేదని స్పష్టం చేశారు. గత ప్రభుత్వపాలకులకు మనసు అనేది లేదు కాబట్టి.. ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడూ చేయలేదని.. వారిది పెత్తందారీ మనస్తత్వమన్నారు.