ఏపీలో కరోనా కొత్త రూల్స్ : పెళ్లిళ్లల్లో 150 మందికే అనుమతి

-

అమరావతి : ఇవాళ సీఎం జగన్ కోవిడ్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట్లాడుతూ.. 45 ఏళ్లకు పై బడిన వారు, గర్భవతులు, టీచర్లకు వ్యాక్సినేషన్‌లో ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. ఆగస్టు 16న స్కూల్స్‌ ప్రారంభానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో వీలైనంత త్వరగా టీచర్లకు వ్యాక్సినేషన్‌ ప్రక్రియ పూర్తిచేయాలని.. కోవిడ్‌ ప్రోటోకాల్స్‌ను తప్పనిసరిగా పాటించేలా చూడాలని పేర్కొన్నారు.

పెద్ద ఎత్తున జనం గుమిగూడకుండా చూడాలని పేర్కొన్న సీఎం జగన్.. పెళ్లిళ్ల సహా శుభకార్యాల్లో వీలైనంత తక్కువమంది ఉండేలా చూడాలన్నారు. పెళ్లిళ్లల్లో 150 మందికే పరిమితం చేయాలని.. మతపరమైన కార్యక్రమాల్లో కూడా ఎక్కువ మంది గుమిగూడకుండా, మాస్కులు వేసుకునేలా, భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని వెల్లడించారు. అధికారులు దీనిపై మార్గదర్శకాలు జారీచేయాలన్న సీఎం.. వ్యాక్సినేషన్‌ ప్రక్రియ జోరుగా సాగేంతవరకూ జాగ్రత్తలు తప్పనిసరని పేర్కొన్నారు. వచ్చే రెండు నెలలపాటు మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు జారీచేశారు. ఆర్టీపీసీఆర్‌ టెస్టులు మాత్రమే చేయాలన్న సీఎం.. ఇంటింటికీ సర్వే కొనసాగాలని, లక్షణాలు ఉన్నవారికి పరీక్షలు చేయాలని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news