ఏపీకి మరో నాలుగు రోజులు భారీ వర్షాలు : సిఎం జగన్

ఏపీలో రేపటి నుంచి మళ్ళీ భారీ వర్షాలు ఉన్నాయని సిఎం జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. వర్షాల సమాచారం నేపథ్యంలో జాగ్రత్తలు కూడా తీసుకోవాలని ఆదేశించారు. 27, 28, 29 తేదీల్లో నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారని.. భారీ వర్ష సూచనపై కలెక్టర్లకు నివేదికలు పంపించాలని ఆదేశాలు జారీ చేశారు సిఎం జగన్.

తద్వారా ఆయా ప్రాంతాల్లో చర్యలు తీసుకునేందుకు వీలు ఉంటుందని.. అధికారులకు సీఎం వైయస్‌.జగన్‌ నిర్ధేశించారు. వర్షాల సమాచారం నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని పేర్కొన్నారు. 13 జిల్లాల్లో ఉన్న ఇరిగేషన్‌ ప్రాజెక్టుల భద్రతపై దృష్టిపెట్టండని.. డ్యాంల భద్రతపై గత ప్రభుత్వాల్లో ఇచ్చిన నివేదికలు బయటకు తీయండని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న నీటి విడుదల సామర్థ్యం, గరిష్ట వరద ప్రవాహంపై అంచనాలను మరోసారి పరిశీలించి, నివేదికలు తయారుచేయాలని.. ఉదాసీనత వల్ల ఇప్పటివరకూ పెండింగులో ఉన్న డ్యాంల భధ్రతపై దృష్టిపెట్టండని ఆదేశించాటు సిఎం జగన్.