అల్లూరి జిల్లా చింతపల్లిలో సీఎం జగన్ పర్యటించారు. ప్రభుత్వ స్కూళ్లలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్స్ పంపిణీ చేసే కార్యక్రమానికి వచ్చారు. చింతపల్లి ఆశ్రమ స్కూల్ లో విద్యార్థులతో కలిసి డిజిటల్ క్లాస్ ల పనితీరును పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో సీఎం మాట్లాడారు.
అనంతరం ఏర్పాటు చేసిన సభలో సీఎం మాట్లాడారు. మన పిల్లలు దేశంలోనే అత్యుత్తమంగా ఉండాలన్నారు సీఎం జగన్. అయితే కొందరూ జగన్ దుబారాగా ఖర్చు పెడుతున్నారని పేర్కొంటున్నారు. అడవి తల్లి బిడ్డల మధ్య గొప్ప కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మన రాష్ట్ర భవిష్యత్ విద్యార్థుల చేతుల్లోనే ఉంది. మన విద్యార్థులు ఈ ప్రపంచంతో పోటీ పడాలి అన్నారు. 8వ తరగతి పిల్లలకు ట్యాబ్ ల పంపిణీ 10 రోజుల పాటు చేస్తాం. ప్రతీ ఎమ్మెల్యే ట్యాబ్ ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. మీ మేనమామగా ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చాను. రూ.620కోట్లతో 4,34,185 మంది విద్యార్థులకు ట్యాబ్ లు అందజేస్తామన్నారు. విద్యార్థులకు ట్యాబ్ ల పంపిణీ చరిత్రలో నిలిచిపోతుంది. పిల్లలకు అవసరమైన బైజూస్ కంటెంట్ తో ట్యాబ్ లు అందజేస్తున్నాం.