కిరోసిన్ దీపంతో చదివిన జగదీశ్ రెడ్డికి వేల కోట్లు ఎలా వచ్చాయి : ఎమ్మెల్యే రాజ గోపాల్ రెడ్డి

-

కిరోసిన్ దీపంతో చదివిన జగదీశ్ రెడ్డికి వేల కోట్లు ఎలా వచ్చాయి అని ప్రశ్నించారు మునుగోడు  ఎమ్మెల్యే రాజ గోపాల్ రెడ్డి. అసెంబ్లీ లో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ సభ్యులను ఉద్దేశిస్తూ తన జోలికి రావద్దని, ఖబడ్దార్ అని హెచ్చరించారు. రాజగోపాల్ వ్యాఖ్యల్ని తీవ్రంగా తప్పుబట్టిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. ఖబడ్దార్ అన్నందుకు ఆ సభ్యుడిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు స్పీకర్ చెప్పాలన్నారు.

నేను పార్టీలు మారిన సమయంలో పదవీకి రాజీనామా చేశాను. దొంగల లెక్క పదవుల కోసం పార్టీలు నేను మారలేదు అన్నారు. నా జోలికి వస్తే ఊరుకునేది లేదు. ఖబడ్దార్ ఏమనుకుంటున్నారో అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. నాలుగు రూపాయలకు దొరికే పవర్ ి.. ఆరు రూపాయలకు పెంచి గత ప్రభుత్వం తప్పు చేసింది. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ నాయకుల పరిస్థితి ఆలోచన చేస్తే జాలేస్తోంది. కిరసనాయిలు దీపం, కిరాయి ఇంట్లో ఉన్న మాజీీ మంత్రి రూ.1000 కోట్లు హైదబాద్ బంగ్లా ఎలా సంపాదించారు అని ప్రశ్నించారు. మాజీ ముఖ్యమంత్రి ముందు ఆ పార్టీ నాయకులు మాట్లాడే ధైర్యం ఉందా? సీఎం ముందు ధైర్యంగా మాట్లాడలేదు కాబట్టే రాష్ట్రం అప్పుల పాలు అయింది.

 

Read more RELATED
Recommended to you

Latest news