బైరెడ్డి సిద్దార్థ రెడ్డి… ఈ పేరు వినగానే వయసుకి మించిన రాజకీయం, వయసుకి మించిన ఆలోచన, వయసుకి మించిన మాటలు, వయసుకి మించిన అనుభవం. మరి ఆరు నెలలు సబ్ జైల్లో ఉండటమో ఏమో తెలియదు గాని పట్టుమని 30 ఏళ్ళు కూడా రాకుండానే ఈయన గారు ఏపీలో హాట్ టాపిక్ అయిపోయారు. బాబు ఎం మాట్లాడినా సోషల్ మీడియాలో మొత్తం వింటుంది. అది స్నేహం గురించి అయినా… ఆయన గెలిచిన రాజకీయం అయినా, మరొకటి మరొకటి అయినా ఆయన అంతే… చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటారు.
ఇప్పుడు అది పక్కన పెడితే… బాబు నియోజకవర్గ నేతల విషయంలో కాస్త దూకుడుగా రాజకీయం చేస్తున్నారు. కొన్నాళ్ళు సైలెంట్ గా ఉన్న ఆయన ఇప్పుడు మళ్ళీ దూకుడు పెంచారు. తాజాగా వ్యవసాయ కమిటి చైర్మన్ పదవి విషయంలో ఆయన తన మాటను నెగ్గించుకున్నారు. దీనితో ఆగ్రహంగా ఉన్న నందికోట్కూరు ఎమ్మెల్యే ఆర్ధర్ రాజీనామా చేస్తారు అనే ప్రచారం ఎక్కువగా జరిగింది. ఆయన ముఖ్యమంత్రి జగన్ కి కూడా ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్పేశారని సోషల్ మీడియాలో ఎక్కువగా వార్తలు వచ్చాయి.
అయితే సిద్దార్థ రెడ్డి తన దూకుడు తో నియోజకవర్గ నేతలను ఇబ్బంది పెడుతున్నారని అంటున్నారు. దీనితో ఆయన మీద గత నెలలో దాదాపు 30 ఫిర్యాదులు వివిధ స్థాయి నాయకుల నుంచి జగన్ వద్దకు వెళ్లాయని సమాచారం. దీనితో సిద్దార్ద్త రెడ్డిని సస్పెండ్ చెయ్యాలని జగన్ భావిస్తున్నారట. ఇంత చిన్న వయసులో రాజకీయాల్లో ఇన్ని విభేదాలు ఆయనకు అవసరం లేదు. కాని ఆయన మాత్రం వివాదాలను మోస్తూ రాజకీయ౦ చేస్తున్నారు. ఇది మంచిది కాదని సీనియర్ నాయకులు చెప్పినా సరే ఆయన వినడం లేదట.