కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామం…. స్టార్ క్యాంపెనర్ గా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నియామకం

-

తెలంగాణపై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ గా దృష్టి సారిస్తోంది. ఇప్పటికే తెలంగాణలో నెలకొన్న కాంగ్రెస్ పరిస్థితులను చక్కదిద్దేందుకు రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలతో భేటీ అయ్యారు. కాంగ్రెస్ గెలుపు కోసం ప్రయత్నించాలని నాయకులకు దిశానిర్థేశం చేశారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పీసీసీ చీఫ్ పై విమర్శలు చేస్తున్న జగ్గారెడ్డి కూడా ఇటీవల రాహుల్ గాంధీని కలిశారు. తెలంగాణలో పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేలా ప్రయత్నిస్తామని అన్నారు జగ్గారెడ్డి. komatireddy venkat reddy

తాజాగా కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ స్టార్ క్యాంపెనర్ గా కోమటిరెడ్డి వెంకటర్ రెడ్డిని నియమించింది. ఈ మేరకు ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మరింతగా దూకుడు పెంచే అవకాశం కనిపిస్తోంది. ఇదిలా ఉంటే తెలంగాణలో త్వరలోనే రాహుల్ గాంధీ బహిరంగ సభ జరుగే అవకాశం కనిపిస్తోంది. ఈమేరకు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కోరగా…రాహుల్ గాంధీ అందుకు ఒప్పుకున్నట్లుగా తెలుస్తోంది. వరంగల్ వేదికగా ఈ సభ జరిగే అవకాశం ఉందని సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news