ఘనంగా హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమం : సీఎం జగన్‌

-

వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా న్యూఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఆజాదీ కా అమృత్‌ మహాత్సవ్‌ సందర్భంగా ‘‘హర్‌ ఘర్‌ తిరంగా’’ కార్యక్రమంపై వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించగా.. క్యాంప్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తికావొస్తున్న సందర్బంగా హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమం ద్వారా పౌరుల్లో దేశభక్తి భావనను పెంపొందించడానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. సమగ్రమైన కార్యాచరణను రూపొందించింది. పలు ప్రభుత్వ విభాగాలతో పలుమార్లు సమీక్ష కూడా నిర్వహించాం. ఈ కార్యక్రమం గురించి ప్రజలకు తెలియజెప్పడానికి బహుముఖంగా ప్రచారం నిర్వహించాం. పత్రికల్లో ప్రకటనలు, హోర్డింగ్స్, పలు గీతాలు రూపొందించాం.

Andhra Pradesh CM YS Jagan Mohan Reddy scheduled to visit Visakhapatnam on  July 13- The New Indian Express

చైతన్యం కలిగించేందుకు సినిమా హాళ్లలో సంక్షిప్త చిత్రాలను ప్రదర్శించాం. ర్యాలీలు, సైకిల్‌ర్యాలీలు నిర్వహించాం. పోస్టర్లతోపాటు పలు కథనాలు కూడా ప్రచురించాం. రాష్ట్రంలో పరిశ్రమలతో పాటు సంబంధిత వ్యాపకంలో ఉన్న ఇతర సంస్ధలు, దుకాణాలు, వాణిజ్య సముదాయాలు అన్నింటిపైనా జాతీయ పతాకాన్ని ఎగురవేసేలా వారిని చైతన్యపరిచాం. సీఎస్‌ఆర్‌ కార్యక్రమంలో భాగంగా వారి ఉద్యోగులకు జాతీయ పతాకాన్ని పంపిణీ చేయాలని నిర్ధేశించాం. ప్రభుత్వ కార్యాలయాల వద్ద అధికారులు జాతీయ జెండాను ఆవిష్కరించాలని చెప్పాం. అదే విధంగా ప్రభుత్వ ఉద్యోగులు వారి, వారి నివాస సముదాయాల వద్ద కూడా జెండా ఆవిష్కరణ చేయాలని చెప్పాం. 5.24 లక్షల రేషన్‌ దుకాణాలు, 15వేల గ్రామ, వార్డు సచివాలయాల్లో జాతీయ పతాకాన్ని ఎగురవేస్తున్నారు. అంగన్‌వాడీ వర్కర్లు, ఆశావర్కర్లు కూడా వారి వారి కార్యాలయాల్లో జాతీయ జెండాలను ఎగురవేస్తారు. 1.20 లక్షల గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది, 2.60 లక్షల మంది వాలంటీర్లు కూడా జాతీయ జెండాలను పంపిణీ చేయడం ద్వారా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యులవుతారని జగన్‌ వెల్లడించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news