నేడు ఆంధ్రప్రదేశ్ లో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మోడీకి స్వాగతం పలికారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఏర్పాటు చేసిన అల్లూరి సీతారామరాజు 30 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు మోడీ.
భీమవరానికి సమీపంలోని కాళ్ల మండలం పెద అమిరంలో జరిగే భారీ బహిరంగసభలో పాల్గొని ప్రసంగిస్తారు మోడీ. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో పాటూ ఏపీ మంత్రులు, ప్రజా ప్రతినిధులు పాల్గొననున్నారు. భీమవరంలో ప్రధాన వేదికపై 11 మందికే అవకాశం ఉందని తెలిపారు అధికారులు. ఉదయం 10.50 నుంచి 12.30 మధ్య ప్రసంగాలు ఉంటాయి.అల్లూరి, మల్లుదొర వారసులను వేదికపై ప్రధాని మోదీ సత్కరించనున్నారు.
అలాగే వారితో మోదీ వ్యక్తిగతంగా భేటీ కానున్నారు. ఈ విగ్రహాన్ని క్షత్రియ పరిషత్ ఆధ్వర్యంలో భీమవరంలో ఏడు అడుగుల సిమెంట్ దిమ్మపై 30 అడుగుల కాంస్య విగ్రహం ఏర్పాటు చేశారు. ఈ విగ్రహం తయారీకి రూ.3కోట్ల వ్యయం అయ్యిందట. పాలకొల్లు మండలం ఆగర్రుకు చెందిన అల్లూరి సీతారామరాజు అనే దాత ఈ రూ.3కోట్లు విరాళం అందజేశారు.
గన్నవరం విమానాశ్రయం వద్ద ప్రధాని శ్రీ నరేంద్రమోదీకి స్వాగతం పలికిన ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్. మరికాసేపట్లో భీమవరం చేరుకుని ఏఎస్ఆర్ పార్కులో జరిగే అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గోనున్న ప్రధాని. pic.twitter.com/Tg90Pd9JWv
— YSR Congress Party (@YSRCParty) July 4, 2022