BREAKING : ఉద్యోగుల ఆందోళనలపై సీఎం జగన్ కీలక ప్రకటన

-

పీఆర్సీ, ఉద్యోగుల ఆందోళనల పై ముఖ్యమంత్రి జగన్ స్పందించారు. పీఆర్సీ అమలు సహా, ఉద్యోగులకోసం కొన్ని ప్రకటనలు చేశామని.. కోవిడ్‌కారణంగా మరణించిన ఫ్రంట్‌లైన్‌ ఉద్యోగుల కుటుంబాల్లోని వారికి ఉద్యోగాలు ఇవ్వడంపై ఇప్పటికే ఆదేశాలు ఇచ్చామని చెప్పారు. కారుణ్య నియామకాలు చేయమని చెప్పామని.. యుద్ధ ప్రాతిపదికన వారికి కారుణ్య నియామకాలు ఇవ్వాలని వెల్లడించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉన్న ఖాళీలను వినియోగించుకోవాలని.. ఇతర విభాగాల్లో ఉద్యోగాలంటే ఆలస్యం జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి, అలాంటి సమస్యలు లేకుండా యుద్ద ప్రాతిపదికన గ్రామ, వార్డు సచివాలయాల్లో ఇవ్వాలని పేర్కొన్నారు.


జూన్‌ 30లోగా కారుణ్య నియామకాలు చేయాలని..అన్ని విభాగాలూ దీనిపై దృష్టిపెట్టాలని ఆదేశించారు. ముందుగా గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉన్న పోస్టులను ప్రాధాన్యతగా తీసుకుని కారుణ్య నియామకాలు చేయాలని.. ఇందులో ఆలస్యానికి తావు ఉండకూడదన్నారు. జగనన్న స్మార్ట్‌టౌన్‌ షిప్స్‌లో 10శాతం స్థలాలను, 20 శాతం రిబేటుపై కేటాయించామని.. ఎంఐజీ లే అవుట్స్‌లో వీరికి స్థలాలు ఇవ్వాలని స్పష్టం చేశారు. వారికి స్థలాలు కేటాయించేందుకు రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను ప్రారంభించాలని.. స్థలాలు కోరుతున్న ఉద్యోగుల పేర్లను రిజిస్ట్రేషన్‌ చేయాలన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news