సీఎం కేసీఆర్ ఇందిరా పార్క్ వద్దకు చేరుకున్నారు. తెలంగాణలో పండిన వడ్లను కేంద్రం కొనాలని టిఆర్ఎస్ సర్కార్ డిమాండ్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇండియా పార్క్ వద్ద నిరసనకు టీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. ఇందిరా పార్క్ వద్దకు చేరుకున్న కేసీఆర్ మాట్లాడుతూ ….కేంద్రం రైతుల పట్ల వ్యతిరేకత తో ఉంది అంటూ ఆరోపించారు. కేంద్రం వైఖరికి వ్యతిరేకంగా యుద్ధానికి దిగినం అంటూ కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇది ఆరంభం మాత్రమే.. ఇంకా ఉదృతం చేస్తాం అంటూ కేంద్రానికి కేసీఆర్ వార్నింగ్ ఇచ్చారు. పంజాబ్ లో కొన్నట్లు ఇక్కడ కూడా వరి ధాన్యం కొనాలని స్వయంగా కోరినామని…ప్రధానికి లేఖ రాసినా ఉలుకు లేదు పలుకు లేదు అంటూ కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఈ రోజుతో ఆగేది లేదు అని దిగివచ్చి రైతులకు న్యాయం చేసే వరకు పోరాటం ఆగదు అంటూ కేసీఆర్ మండి పడ్డారు. ఉధృతమై ఉప్పెనోలే మారుతుంది నాటు కేసీఆర్ వార్నింగ్ ఇచ్చారు. ఇక ఇప్పటికే ఇందిరా పార్క్ వద్ద మంత్రి కేటీఆర్,మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్సీ కవిత ఇతర టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు, కార్యకర్తలు భారీగా చేరుకున్నారు.