రైతులను బతకనిచ్చే పరిస్థితిలో బీజేపీ లేదు.. ఎరువుల ధరలు పెంచడం దుర్మార్గం- సీఎం కేసీఆర్

-

బీజేపీ, కేంద్ర రైతు వ్యతిరేఖ విధానాలపై సీఎం కేసీఆర్ ఫైర్ అయ్యారు. బీజేపీ ప్రభుత్వం రైతాంగాన్ని బతకనిచ్చే పరిస్థితి లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎరువుల ధరలను పెంచడంపై కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం కేసీఆర్. ఎరువుల ధరలను పెంచుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేఖిస్తూ.. సీఎం ప్రధాని మోదీకి లేఖ రాయనున్నారు. కేంద్రం వ్యవసాయ ఖర్చులను రెట్టింపు చేయడం దుర్మార్గమని ఆయన అన్నారు. వ్యవసాయ రంగం, అనుబంధ రంగాలను నిర్వీర్యం చేసేలా కేంద్రం నిర్ణయాలను తీసుకుంటుందని ఆయన అన్నారు. రైతుల నడ్డి విరిచేలా కేంద్రం నిర్ణయాలు తీసుకుంటుందని ఆయన వ్యాఖ్యానించారు. రైతులను వారి పొలాల్లోనే కూలీలుగా మార్చే కుట్ర చేస్తుందని బీజేపీపై మండిపడ్డారు. ఎరువుల ధరలు తగ్గించేలా పోరాటం చేస్తామని.. దేశ వ్యాప్తంగా ఆందోళనలను చేపడుతామని సీఎం అన్నారు. బీజేపీ ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకిలించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ రంగానికి విస్తరించకుండా కేంద్రం నాన్చుతోందని ఆరోపించారు. 2022 కల్లా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్న కేంద్ర ప్రభుత్వం ఎరువుల ధరలను పెంచి రైతుల నడ్డి విరుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరెంట్ మోటార్ల వద్ద మీటర్లు పెట్టి బిల్లులు వసూలు చేసే దుర్మార్గపు చర్యలకు పాల్పడుతుందని ఆరోపించారు సీఎం కేసీఆర్. వ్యవసాయాన్ని కార్పోరేట్లకు కట్టబెట్టె చర్యలను వ్యతిరేకించాలి పిలుపునిచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news