గిరిజనులకు త్వరలోనే గిరిజన బంధు ఇవ్వబోతున్నాం: కేసీఆర్

-

గిరిజనులకు సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. భూమిలేని గిరిజన బిడ్డలకు త్వరలో గిరిజన బంధు ప్రారంభిస్తామని టీఎస్ సీఎం కేసీఆర్ తెలిపారు. ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లేని గిరిజన కుటుంబాలను దీంతో ఆడుకుంటామన్నారు. పోడు భూముల సమస్యపై అసెంబ్లీలో మాట్లాడుతూ ఈ ప్రకటన చేశారు.

చతిస్గఢ్ కు చెందిన గుత్తి కోయలు ఇక్కడకు వలస వచ్చి అధికారులపై జూలుం చేయడం సరికాదన్నారు. వారు భూమిని ఆక్రమిస్తే అడ్డుకోబోయిన ఫారెస్ట్ అధికారిని పట్టపగలే చంపడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. ఫిబ్రవరిలోనే 11 లక్షల ఎకరాల పోడు భూముల పంపిణీ చేస్తామని తెలిపారు సీఎం కేసీఆర్‌. పోడు భూములు పంపిణీ చేసి..వారికి కూడా రైతు బంధు కూడా ఇస్తామని ప్రకటించారు సీఎం కేసీఆర్‌. పోడు భూములపై అనవసర రాద్దాంతం చేస్తున్నారని సీఎం కేసీఆర్‌ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news