తెలంగాణలో రాజకీయాలు ఎప్పుడు ఎలాంటి మలుపులు తిరుగుతుందో అర్ధం కాకుండా ఉంది..రాజకీయంగా ఊహించని ట్విస్ట్‌లు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఎన్నికలకు సమయం దగ్గరపడుతుంది. దీంతో మూడు ప్రధాన పార్టీల మధ్య రాజకీయ యుద్ధం తారస్థాయిలో నడుస్తోంది. అయితే మొన్నటివరకు బిఆర్‌ఎస్ వర్సెస్ బిజేపి అన్నట్లు రాజకీయ యుద్ధం నడిచింది..ఇప్పుడు కూడా అదే స్థాయిలో ఆ రెండు పార్టీల మధ్య వార్ నడుస్తోంది.
కాకపోతే సడన్ గా ఇప్పుడు కాంగ్రెస్ రేసులోకి రావడానికి ప్రయత్నిస్తుంది. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీలో ఉండే అంతర్గత విభేదాలు వల్ల..ఆ పార్టీ డౌన్ అయింది. పైగా కేసిఆర్..తెలివిగా బిఆర్‌ఎస్ వర్సెస్ బిజేపి అన్నట్లు రాజకీయ యుద్ధం మార్చారు. ఎలాగో అటు కేంద్రంలో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేయడం వల్ల తమకు మైలేజ్ పెరగదు. అందుకే అక్కడ అధికారంలో ఉన్న బిజేపిని టార్గెట్ చేశారు. దీంతో బిజేపి సైతం..తెలంగాణపై గట్టిగా ఫోకస్ చేసి రాజకీయం చేస్తుంది. దీంతో ఈ పోరులో కాంగ్రెస్ వెనుకబడింది.
కానీ గ్రౌండ్ రియాలిటీ చూస్తే బిజేపి తో పోలిస్తే కాంగ్రెస్ పార్టీకి బలమైన నాయకత్వం, కార్యకర్తలు ఉన్నారు. దీంతో ఆ పార్టీకి కాస్త ఊపు తీసుకురావడానికి టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్ర మొదలుపెట్టిన విషయం తెలిసిందే. పాదయాత్ర విజయవంతంగా నడుస్తోంది. ఇదే క్రమంలో పేదలకు ఉపయోగపడని ప్రగతి భవన్‌ని నక్సలైట్లు పేల్చేసిన పర్లేదని రేవంత్ కామెంట్ చేయడం సంచలనంగా మారింది.
దీంతో బిఆర్‌ఎస్ నేతలు రేవంత్ పై ఎటాక్ మొదలుపెట్టారు. వరుసపెట్టి రేవంత్ ని target చేసి ఫైర్ అవుతున్నారు. అటు కాంగ్రెస్ నేతలు ధీటుగా బిఆర్‌ఎస్ పార్టీకి కౌంటర్లు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో పోలిటికల్ వార్ బిఆర్‌ఎస్ వర్సెస్ కాంగ్రెస్స్ అన్నట్లు మారింది. మరి ఇదే పరిస్తితి కొనసాగితే కాంగ్రెస్ రేసులోకి రావడం ఖాయమని చెప్పవచ్చు.