టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సోమవారం రాత్రి 7 గంటల సమయంలో ఢిల్లీకి బయలుదేరారు. బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరిన కేసీఆర్‌తో తెలంగాణ కేబినెట్‌లోని పలువురు మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు బయలుదేరారు. వీరంతా సీఎం కేసీఆర్ ఢిల్లీ టూర్ ముగిసేదాకా ఆయనతో పాటే ఉండనున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కూడా కేసీఆర్ వెంట ఢిల్లీ వెళ్లారు సీఎం కేసీఆర్.
కేసీఆర్ ఢిల్లీ టూర్ ఎన్ని రోజుల పాటు జరుగుతుందన్న విషయంపై స్పష్టమైన సమాచారమేదీ లేదు. కేసీఆర్ ఢిల్లీ వెళుతున్నారని చెప్పిన అధికారిక యంత్రాంగం అక్కడ ఆయన టూర్ షెడ్యూల్ ఇలా ఉంటుందని ప్రకటనేమీ విడుదల చేయలేదు. రెండు, మూడు రోజుల పాటు ఢిల్లీలో కేసీఆర్ పర్యటించనున్నట్లు సమాచారం. ఈ పర్యటనలో పలు పార్టీలకు చెందిన జాతీయ స్థాయి నేతలతో కేసీఆర్ మంతనాలు సాగిస్తారని తెలుస్తోంది.