ఆర్టీసీ కార్మీకుల‌కు సీఎం కేసీఆర్ అదిరిపోయే ఆఫ‌ర్లు..

-

రాష్ట్రంలోని మొత్తం 97 డిపోలకు చెందిన ఆర్టీసీ కార్మికులతో ఈ రోజు ప్రగతి భవన్ లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమయ్యారు. ప్రతి డిపో నుంచి ఐదుగురు కార్మికులను ఈ సమావేశానికి ఆహ్వానించారు. కార్మికులతో కేసీఆర్ మధ్యాహ్న భోజనం కూడా చేశారు. అనంతరం ఆర్టీసీ కార్మీకుల‌కు కేసీఆర్ వ‌రాల జ‌ల్లు కురింపించారు. పదవీ విరమణ వయస్సు 60 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా సెప్టెంబర్ నెల జీతం కూడా సోమవారం లోగా చెల్లించాలని అధికారులను ఆదేశించారు. సమ్మె చేసిన 52 రోజుల కాలానికి జీతం కూడా చెల్లిస్తామని హామీ ఇచ్చారు.

ప్రయాణికులు టిక్కెట్ తీసుకోకపోతే కండక్టర్లకు విధిస్తున్న జరిమానాను ఇకపై ప్రయాణికుల నుంచే వసూలు చేయాలని కేసీఆర్ నిర్ణయించారు. డిపోల్లో మహిళల కోసం ప్రత్యేక వసతులు కల్పించాలని, ఇకపై మహిళలకు ఎలాంటి ఇబ్బందులూ ఉండొద్దని సీఎం అధికారులను ఆదేశించారు. సంస్థ కోసం కార్మికులు కష్టపడి పనిచేయాలని, బాగా పనిచేసి లాభాల్లోకి తీసుకొస్తే సింగరేణి లాగా బోనస్ ప్రకటిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news