ఎస్సీ నిరుద్యోగులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్

-

TSPSC నిర్వహించే గ్రూప్‌ 1, 2, 3,4 ఉద్యోగాలకు ప్రిపేర్‌ అయ్యే ఎస్సీ విద్యార్థులకు కేసీఆర్‌ సర్కార్‌ శుభవార్త చెప్పింది. ఎస్సీ ఉద్యోగార్థుల కోసం 33 జిల్లాల్లో ఉచిత కోచింగ్‌ అందించనున్నట్లు ప్రకటన చేసింది. ఒక్కో జిల్లా కేంద్రంలోని స్టడీ సెంటర్లలో 75 నుంచి 150 మందికి ఉచితంగా కోచింగ్‌ ఇవ్వనున్నారు.

డిగ్రీ ఉత్తీర్ణులై ఉండి.. కుటుంబ వార్షిక ఆదాయం రూ. 3 లక్షల లోపు ఉన్న వారికి అవకాశం కల్పించనున్నారు. డిగ్రీలో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 9 వ తేదీ నుంచి 18 వ తేదీ వరకు ఆన్‌ లైన్‌ లో తమ వివరాలను నమోదు చేసుకోవచ్చు. డిగ్రీ మార్కుల ఆధారంగా 19 వ తేదీన మెరిట్‌ జాబితాను రూపొందించి.. 20 న విడుదల చేయనున్నారు. దీని రిజస్ట్రేషన్‌ కోసం http://tsstudycircle.co.in ను సంప్రదించాల్సి ఉంటుంది.

NOTE : ఎంట్ర‌న్స్ ప‌రీక్ష‌ల కోసం ప్రిపేర్ అవుతున్నారా?? ప్ర‌భుత్వోద్యోగం మీ ల‌క్ష్య‌మా.. అయితే Manalokam’s Vijayapatham.com వెబ్‌సైట్‌లో ప్రాక్టీస్ బిట్స్ , ఆన్‌లైన్ ఎగ్జామ్స్ ద్వారా మీ నాలెడ్జ్‌ను పెంచుకోండి. మ‌రెన్నో ఇంట్రెస్టింగ్, వింత‌లు విశేషాలు, ప్రేర‌ణాత్మ‌క‌ క‌థ‌నాల కోసం మ‌న‌లోకం.కామ్ ని ఫాలో అవ్వండి.

Read more RELATED
Recommended to you

Latest news