కేంద్ర ఎన్నికల సంఘంపై సీఎం కేసీఆర్ సీరియస్

-

తెలంగాణ సీఎం కేసీఆర్‌… కేంద్ర ఎన్నికల సంఘంపై సీరియస్‌ అయ్యారు. భారత ఎన్నికల సంఘం హద్దు మీరుతోందని… మండిపడ్డారు. ప్రతి దానికి కిరికిరి పెడుతోందన్నారు. నిన్న గాక మొన్న నాగార్జున సాగర్ ఉప ఎన్నిక జరిగిందని… గుత్తా ప్రచారం చేస్తా అంటే నేను వద్దు అన్న అని పేర్కొన్నారు. నాగార్జున సాగర్ నా సభ అడ్డుకుకోవడానికి హైకోర్టు లో కేసు వేశారని మండిపడ్డారు.

హుజురాబాద్ ఎన్నికలో కేసీఆర్ సభ పెట్ట కుండా చేశారని…..ఇది ఎక్కడి రాజకీయం ? అని నిప్పులు చెరిగారు. ఈసీ తన పరిధిని దాటిందని… హుజురాబాద్ పోరాటంలో మన పార్టీ ,ఎమ్మెల్యేలు , మంత్రులు ఉన్నారని చెప్పారు. హుజురాబాద్ లో నవంబర్ , డిసెంబర్ లో 100 శాతం దళిత బంధు అమలు కావాలని చెస్తామన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన వరకు సాగిన ఉద్వేగ భరిత వాతావరణం.. ఆవేశాన్ని.. పరిస్థితులను… సామాజిక అభివృద్ధి వైపు మార్చగలిగామని చెప్పారు కేసీఆర్‌. తెలంగాణ వస్తే కారు చీకట్లు వస్తాయని… అభివృద్ధి జరగదని… పరిపాలన సాధ్యం కాదని అన్నారని చెప్పారు. కేంద్రం ఇచ్చిన లెక్కల ప్రకారమే…తెలంగాణ అనేక రంగాల్లో అగ్రగామిగా నిలిచిందని స్పష్టం చేశారు సీఎం కేసీఆర్‌.

Read more RELATED
Recommended to you

Latest news