భారీ వసూళ్లను రాబడుతున్న ”అసలేం జరిగింది ?”

కోలీవుడ్‌ హీరో శ్రీ రామ్‌ తమిళ్‌ లో పలు సినిమాలు చేస్తూనే తెలుగులో సపోర్టింగ్‌ రోల్స్‌ ప్లే చేస్తుంటారు. ఒకరికి ఒకరు చిత్రంతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన చాలా తెలుగు సినిమాల్లో సహాయ పాత్రలు పోషించాడు. తాజాగా ఆయన హీరోగా నటించిన ”అసలేం జరిగింది” ? థియేటర్స్‌ లో విడుదలైంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో విడుదలైన ఈ సినిమా పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుని ముందుకు సాగుతున్నది. ఈ మూవీ లో హీరో శ్రీ రామ్‌ సరసన హీరోయిన్‌ తొలిసారి సంచయిత పడుకొనే హీరోయిన్‌ గా నటించగా.. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్క్‌ అవుట్‌ అయింది.

హీరో శ్రీరామ్‌ తన జీవితం లో అనుకోకుండా ఎదురైన ఉప ద్రవాలను ఎలా ఎదుర్కొంటాడనేది ఆసక్తి కరంగా చూపించారు. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా విజయ వంతంగా సాగుతున్న నేపథ్యంలో… ప్రేక్షకులకు స్పెషల్‌ థ్యాంక్స్‌ చెప్పారు హీరో శ్రీ రామ్‌. తెలంగాణ రాష్ట్రంలో ఈ సినిమా షూటింగ్‌ జరిగిందని… సినిమా కథ చాలా బాగుందన్నారు. అందుకే ప్రేక్షకులు బాగా తమ సినిమాను ఆదిరిస్తున్నారని పేర్కొన్నారు. క్రైమ్‌ థ్రిల్లర్‌ గా తెరకెక్కిన తమ సినిమాలో పాటలు కూడా చాలా బాగున్నాయని చెప్పారు హీరో శ్రీ రామ్‌. తమ సినిమా చూడని వారు.. కచ్చితంగా సమీపంలోని థియేటర్లలో చూడాలని కోరారు శ్రీ రామ్‌.