చైనాలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా…అమల్లోకి కఠిన ఆంక్షలు..!

కరోనా పుట్టినిల్లు చైనా లో మహమ్మారి మళ్లీ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. దేశంలో కేసులు మళ్లీ నమోదు అవుతున్నాయి. మహమ్మారి వైరల్ చైనాలో పుట్టి దాదాపు రెండేళ్లు అవుతున్నా ఇప్పటికీ దేశాన్ని వదలడం లేదు. అయితే ఇంతకాలం సైలెంట్ గా ఉన్న మహమ్మారి మళ్లీ విజృంభిస్తూ ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఇక కేసులు పెరగటం తో మళ్లీ అధికారులు కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. కరోనా నెగిటివ్ రిపోర్ట్ ఉన్నవారినే భయటకు రాణిస్తున్నారు.

తాజాగా జియోన్ లాంవోజ్ నగరానికి చెందిన 60 శాతం విమానాలను రద్దు చేశారు. ఇదిలా ఉంటే దేశ వ్యాప్తంగా నిన్న 43కొత్త కరోనా కేసులు నమోదు అయ్యాయి. అయితే మళ్లీ కరోనా విజృంభిస్తు ఉండటం తో అది ప్రమాదం కర వేరియంట్ అయ్యి ఉంటుందని వైద్యాధికారులు భావిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఇక చైనా కరోనా ను సమర్థవంతంగా ఎదురుకున్న సంగతి తెలిసిందే. వైరస్ చైనాలో పుట్టగా అమెరికా భారత్ లాంటి దేశాలను ఊపేసింది.