సిఎం కెసిఆర్ కీలక భేటీ.. లాక్ డౌన్ పై కాసేపట్లో కీలక ప్రకటన !

సీఎం కేసీఆర్.. కాసేపటి క్రితమే ప్రగతి భవన్ కు చేరుకున్నారు. ప్రగతి భవన్ కు చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్.. మంత్రులు మహమ్మద్ అలీ, హరీష్ రావు, శ్రీనివాస్ గౌడ్ తో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో లాక్ డౌన్ సడలింపుతో పాటు ఐఏఎస్ మరియు ఐపీఎస్ ల బదిలీలపై కీలకంగా చర్చించనున్నారు. అయితే  తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో లాక్ డౌన్ ఎత్తివేయాలని యోచిస్తోన్నట్లు సమాచారం. లాక్ డౌన్ కారణంగా రాష్ట్ర ఖజానా చాలా దెబ్బ తిన్న సంగతి తెలిసిందే.

రాష్ట్ర ఖజానాకు ఆదాయం పెంచుకోవాలని.. అందులో భాగంగానే లాక్ డౌన్ ను ఎత్తివేయాలని యోచిస్తోంది సర్కార్. అంతేకాదు జులై 1 నుంచి 50 శాతం వరకు ఆక్యుపెన్సీతో థియేటర్లు, బార్లు, జిమ్‎లకు అనుమతి ఇచ్చే అవకాశం ఉంది. అయితే  దీనిపై ఇవాళ క్లారిటీ రానుందని సమాచారం. కాగా జూన్ 19 తో తెలంగాణలో లాక్ డౌన్ గడువు ముగుస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మినహాయింపులు ఇచ్చారు.