తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ సీపీఎం ఆల్ ఇండియా అగ్రనేతలతో ఈ రోజు సమావేశం అయ్యారు. హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో సీపీఎం ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరీతో పాటు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తో సమావేశం అయ్యారు. అంతే కాకుండా వీరికి ప్రగతి భవన్ లో వింధు కూడా ఏర్పాటు చేశారు. విందు అనంతరం దాదాపు గంటన్నర పాటు సమావేశం జరిపారు. అయితే ఈ మధ్య కాలంలో టీఆర్ఎస్ పార్టీకి బీజేపీ నాయకులకు మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న పరిస్థితుల్లో సీపీఎం ఆల్ ఇండియా కార్యధర్శితో పాటు కేరళ ముఖ్య మంత్రితో సమావేశం కావడం రాజకీయంగా ఆసక్తి రేపుతుంది.
ఈ సమావేశంలో బీజేపీ ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో ఎలా నిలవరించాలనే విషయం పై ప్రధానంగా చర్చ జరిగినట్టు తెలుస్తుంది. అలాగే రాష్ట్రంలో దేశంలో బీజేపీతో పోరడాటానికి సీఎం కేసీఆర్ పొత్తులు పెట్టుకుంటున్నట్టు గత కొద్ది రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. అయితే అందులో భాగంగా ముందుగా సీపీఎం తో స్నేహం చేస్తున్నట్టు తెలుస్తుంది. వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేసే విధంగా రెండు పార్టీలు ముందుకు సాగే విధంగా చర్చలు జరిగాయని తెలుస్తుంది. అలాగే కేసీఆర్ గతంలో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుకు చాలా కృషి చేశారు. అయితే ప్రస్తుతం జరిగిన భేటీతో థర్డ్ ఫ్రంట్ అంశం కూడా తెర పైకి వచ్చింది.