కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో పండించిన ప్రతీ గింజను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని వెల్లడించారు. ఇంతకుముందు రైతాంగానికి మేము చెప్పామని.. కేంద్రంలో పనికి మాలిన ప్రభుత్వం ఉందని… దీంతో 20 లక్షల ఎకరాలు వరి పంటను తగ్గించామని అన్నారు. కేంద్ర ప్రభుత్వమే కొంటుందని బీజేపీ నాయకులు రైతులను తప్పుదోవ పట్టించారని విమర్శించారు. దిక్కుమాలిన కేంద్ర ప్రభుత్వం హ్యాండ్ ఇచ్చినా… మేం మా రైతులను బాధపెట్టమని, మా రైతాంగాన్ని చెడగొట్టుకోలేమని సీఎం కేసీఆర్ అన్నారు. యాసంగిలో వడ్లు లేకుండా ప్రతీ గింజను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తామని సీఎం కేసీఆర్ వెల్లడించారు. దీని కోసం నలుగురు నిపుణులతో చీఫ్ సెక్రటరీతో కమిటీ వేశామని అన్నారు. దీంట్లో ఫైనాన్స్ సెక్రటరీ, అగ్రికల్చర్ సెక్రటరీ, ఇరిగేషన్ సెక్రటరీ ఈ నలుగురితో కమిటీ వేశాం అన్నారు. తక్కువ నష్టంతో ధాన్యం కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు. రేపటి నుంచే కొనుగోలు ప్రక్రియ ప్రారంభం అవుతుందని.. రాబోయే రెండుమూడు రోజుల్లో ధాన్యం కొనుగోలు ప్రారంభిస్తామని వెల్లడించారు. రైతులు ఒక్క గింజ కూడా తక్కువ ధరకు అమ్మవద్దని… రూ. 1960 మద్దతు ధరతో ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని సీఎం కేసీఆర్ రైతులకు హామీ ఇచ్చారు. రైతాంగాన్ని చిన్న బుచ్చే ప్రసక్తే లేదని సీఎం కేసీఆర్ అన్నారు.
కేసీఆర్ సంచలన నిర్ణయం.. రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని వెల్లడి
-