హుజూరాబాద్ ఉప ఎన్నిక : సిఎం కెసిఆర్ మరో స్కెచ్ ?

-

తెలంగాణలో ఈటల ఎపిసోడ్ తరువాత గులాబీ అధినేత రూట్ మార్చారా అంటే నిజమే అనిపిస్తుంది. ఈటెల రాజీనామాతో ఖాళీ అయిన బీసి నాయకుడి స్థానాన్ని మరో బిసితో పాటు మలిదశ తెలంగాణా ఉద్యమానికి ఉపిరి పోసిన బెల్లి లలిత కుటుంబానికి ఇచ్చి అండగ ఉండాలని టిఆర్ఎస్ అధిష్టానం వ్యూహ రచన చేస్తోందని సమాచారం అందుతోంది. తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు ఇచ్చిన హామీతో పాటు వారికి అండగా ఉండాలని మలిదశ ఉద్యమ నాయకుడు బెల్లి క్రిష్ణ యాదవ్ కు ఎమ్మెల్యే కోటాలో ఎమ్యెల్సీ ఇచ్చి పార్టీలోకి ఆహ్వానం పంపినట్లు తెలుస్తున్నది. దీనికి స్థానిక ఎమ్యెల్యేతో పాటు బెల్లి క్రిష్ణయాదవ్ కు సన్నిహితంగా ఉన్న మరో ఇద్దరు ఎమ్యెల్యేలతో కూడా చర్చలు జరిగాయి అని తెలుస్తుంది. ప్రస్తుత ఎమ్యెల్యే స్వంత ఊరు కుడా బెల్లి క్రిష్ణ యాదవ్ ది ఒకే ఊరు కావడంతో ఇద్దరి మధ్య మంచి సన్నిహితం ఉంది.

గతంలోనే బెల్లి లలిత సోదరుడు బెల్లి క్రిష్ణ యాదవ్ కు రాజ్యసభ సీటు ప్రకటించినా.. చివరి నిమిషంలో కొంత మంది నాయకుల వల్ల బడుగుల లింగయ్యకు ఆస్థానాన్ని కేటాయించారు. ఉద్యమ నాయకులను హక్కున చేర్చుకుని వారికి గతంలో ఇచ్చిన మాటను ఇప్పుడు నెలబెట్టుకొవాలని ముఖ్యమంత్రి కెసిఆర్ చూస్తున్నారని తెలుస్తుంది. ప్రస్తుతం తెలంగాణలో రోజు రోజుకు మారుతున్న రాజకీయ సమీకరణలు దృష్టిలో ఉంచుకుని బెల్లి క్రిష్ణ యాదవ్ కు ఎమ్యెల్సీ ఇచ్చి పార్టీలో చేర్చుకుంటే ఇటు అమరవీరుల కుటుంబానికి కూడా న్యాయం చేసినట్లు అవుతుందని భావిస్తునట్లు తెలుస్తుంది. ఈ వ్యహాం ఫలిస్తే.. హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అవలీలగా గెలుస్తుందని గులాబీ బాస్ భావిస్తున్నారట.

Read more RELATED
Recommended to you

Latest news