ప్రధాన మంత్రులు, ముఖ్యమంత్రులు, మంత్రులు బాధ్యతలు స్వీకరించేటప్పుడు దైవం లేదా తల్లిదండ్రులు లేదా మనసాక్షిగా ప్రమాణ స్వీకారం చేస్తుంటారు. ఇది సర్వసాధారణం. కానీ, కర్ణాటక మంత్రివర్గ విస్తరణలో వింత సంఘటన చోటుచేసుకుంది. గోమూత్రం ( Cow Urine ) ప్రమాణం చేసి బాధ్యతలు స్వీకరించాడు ఓ మంత్రి.
కర్ణాటక సీఎం బసవరాజ బొమ్మై బుధవారం క్యాబినెట్ విస్తరణ చేపట్టారు. మొత్తం 29మంది మంత్రులతో రాజ్‌భవన్‌లో గవర్నర్ థావర్‌చాంద్ గెహ్లాట్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఆసక్తికరంగా కొంత మంది దేవుడు, రైతులు, గోమూత్రంపై ప్రమాణం చేశారు.
తొలుత ఆనంద్ సింగ్ విజయనగర విరుపాక్ష, భువనేశ్వరీ మాతపై ప్రమాణం చేసి బాధ్యతలు స్వీకరించారు. ‘గోమూత్రం’ పేరుపైన ప్రభు చౌహన్ ప్రమాణం తీసుకోగా, ప్రముఖ లింగాయత్ లీడర్ ముర్గేశ్ నిరాని దేవుడు, రైతులపై ప్రమాణం చేసి బాధ్యతలు స్వీకరించారు.
ప్రమాణ స్వీకారం కార్యక్రమం కంటే ముందు బెంగళూరులో సీఎం బసవరాజ బొమ్మై మీడియాతో మాట్లాడారు. మొత్తం 29 మంది మంత్రులు ప్రమాణం చేస్తారని తెలిపారు. గతంలో బీఎస్ యడియూరప్ప క్యాబినెట్‌లో ముగ్గురు ఉప ముఖ్యమంత్రులు ఉండేవారు. కానీ, అధిష్ఠానం మార్గదర్శకాల మేరకు ఈసారి డిప్యూటీ సీఎం పదవి ఉండదని సీఎం బసవరాజ బొమ్మై స్పష్టం చేశఆరు.
అనుభవజ్ఞులు, కొత్త వ్యక్తుల కలబోతగా బజవరాజ బొమ్మై మంత్రివర్గం ఉన్నది. క్యాబినెట్‌లో ఏడుగురు ఓబీసీలు, ముగ్గరు ఎస్సీలు, ఒక ఎస్టీ, ఏడుగురు ఒక్కలిగ్గలు, ఎనిమిది మంది లింగాయత్‌లు, రెడ్డి, సామాజికవర్గానికి చెందిన ఒక్కరికి చోటు కల్పించారు. క్యాబినెట్‌లో ఒకే ఒక మహిళా మంత్రి ఉండటం గమనార్హం.