బండి సంజయ్ పై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం కెసిఆర్ ఫైర్ అయ్యారు. హద్దు లు మీరి మాట్లాడకు మిస్టర్ బండి సంజయ్ అని.. తన హద్దులు నాకు తెలుసన్నారు. బండి సంజయ్ ధ్యానం తప్ప సొల్లు అంతా మాట్లాడారని.. ప్రజల పక్షాన నిలబడి మాట్లాడితే దేశ ద్రోహా ? అని నిలదీశారు సిఎం కెసిఆర్. చైనా ఆక్రమిస్తుం దని చెబితే దేశ ద్రోహ ? చైనా లో నేను డబ్బులు దాచుకున్నానా ? అని నిలదీశారు.
ధాన్యం ఎంత తీసుకుంటారో లేదో చెప్పు అని నిలదీశారు. తెలంగాణ లో మొత్తం ధాన్యం కొనాలని.. కోనేవరకు వదిలి పెట్టమనీ స్పష్టం చేశారు. దళిత సీఎం ను చేయలేదు.. అది వాస్తవమనీ..
దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి… షబ్బీర్ అలీ కూడా ఈ విషయం చెప్పారని గుర్తు చేశారు. నా నిర్ణయాన్ని ప్రజలు ఆమోదించారన్నారు. రెండో సారి 83 సీట్లలో మళ్లీ గెలిపించారని తెలిపారు కెసిఆర్. లక్షా 35 వేల ఉద్యోగాలు ఇచ్చామనీ.. మరో 70 వేల ఉద్యోగాలు ఇస్తామనీ ప్రకటించారు. జోనల్ ఆమోదం కోసం కేంద్రం సతాయించిందని మండిపడ్డారు.