టీఆర్ఎస్ పార్టీ కేంద్రంపై మరోసారి పోరాటానికి సిద్ధం అయింది. ఈరోజు టీాఆర్ఎస్ఎల్పీ సమావేశం కానుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం జరగబోతోంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా అధ్యక్షలు, జడ్పీ చైర్మన్లు, రైతుబంధు సమితి నాయకులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. ఇప్పుడిప్పుడే వీరంతా తెలంగాణ భవన్ కు చేరుకుంటున్నారు. మరికాసేపట్లో సమావేశం ప్రారంభం కానుంది. యాసంగిలో వరి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలనే ప్రధాన డిమాండ్ తో ఈ సమావేశాన్ని నిర్వహించనున్నారు. వరి ధాన్యం కొనుగోలుపై నిరసనలు, ఆందోళన కార్యక్రమాలపై దిశానిర్థేశం చేయనున్నారు. యాసింగి వరిధాన్యం కొనుగోలుపై కేంద్రం ప్రభుత్వ వైఖరి ఎలా ఉంది… కేంద్రం కొనబోమని చెబితే ఎలాంటి ఆందోళన కార్యక్రమాలు, నిరసనలు చేయాలనే దానిపై కార్యాచరణపై చర్చించే అవకాశం ఉంది.
సమావేశం అనంతరం కేసీఆర్ స్వయంగా కేంద్ర ప్రభుత్వ వైఖరిపై, నిరసన కార్యక్రమాలు, కార్యాచరణ వివరించే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే సాయంత్రం సీఎం కేసీఆర్, మంత్రులతో కలిసి ఢిల్లీకి వెళ్లనున్నారు. అంతకుముందు ఎంపీలతో కూడా సమావేశం కానున్నారు. పార్లమెంట్ లో అనుసరించే వ్యూహాలపై చర్చించనున్నారు. ఢిల్లీ వెళ్లిన తర్వాత ప్రధాని మోదీతో పాటు ఇతర మంత్రులను కూడా కేసీఆర్ టీం కలిసే అవకాశం ఉంది.