తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం… ఉక్రెయిన్ విద్యార్థుల ఖర్చు భరిస్తామని వెల్లడి

-

తెలంగాణ ప్రభుత్వం ఉక్రెయిన్ లో వైద్య విద్యను అభ్యసించి ఇటీవల యుద్ధనేపథ్యంలో ఇండియాకు వచ్చిన విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఉక్రెయిన్ మెడిసిన్ విద్యార్థుల ఖర్చు భరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ అసెంబ్లీలో సీఎం కేసీఆర్ విద్యార్థుల పట్ల కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎంత ఖర్చైనా వారిని మెడిసిన్ చదివిస్తామని.. డాక్టర్లుగా తీర్చిదిద్దుతామని కేసీఆర్ సభలో వెల్లడించారు. 20 వేల పైగా పిల్లలు ఉక్రెయిన్ లో భారతీయ పిల్లలు చిక్కుకుపోయారని.. అక్కడ వైద్య విద్యను అభ్యసించడానికి వెళ్లారని అన్నారు. మన రాష్ట్రం నుంచి 740 పైచిలుకు పిల్లలు ఎంబీబీఎస్ చదవడానికి వెళ్లారని.. ఇక్కడ కోటి రూపాయలు అడుగుతున్నారని.. అక్కడ రూ. 20-25 లక్షల్లో మెడిసిన్ అయిపోతుందని చీప్ గా అయిపోతుందని విద్యార్థులు ఉక్రెయిన్ కు వెళ్లారని కేసీఆర్ అన్నారు. ఇక్కడ దిక్కులేక అక్కడకు వెళ్లారని… మళ్లీ ఈ యుద్ధం ముగిసేలా లేదని.. ఉక్రెయిన్ వెళ్లే పరిస్థితులు లేవని కేసీఆర్ అన్నారు. 700 పిల్లలను టికెట్లు భరించి ఉక్రెయిన్ నుంచి వాపస్ తెచ్చామని వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వంగా వాళ్ల చదువుకు అయ్యే ఖర్చును భరిస్తామని సీఎం కేసీఆర్ అన్నారు. దీనిపై భారత ప్రభుత్వానికి లేఖ రాస్తామని అన్నారు. విద్యార్థులు డిస్ కంటిన్యూ కాకుండా.. వారి భవిష్యత్ దెబ్బతినకుండా చూస్తామని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news