తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు నేడు యాదాద్రికి వెళ్లనున్నారు. ఈ విషయాన్ని యాదాద్రి ఆలయ ఈవో ఎన్ గీత ప్రకటన చేశారు. యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇవాళ ఉదయం 11 గంటలకు బాలాలయంలో.. జరిగే తిరు కళ్యాణోత్సవంలో తెలంగాణ సిఎం కేసీఆర్ పాల్గొంటారని ఆమె వెల్లడించారు.
ఈ నెల 21 న మహా కుంభ సంప్రోక్షణ కు అంకురార్ఫణ జరుగనున్న నేపథ్యలో.. ఏర్పాట్ల పై అధికారులతో సమీక్ష జరుపనున్నట్లు సమాచారం అందుతోంది. యాగాలు, హోమాలు, పూజలకు కావాల్సిన ఏర్పాట్లతో పాటు యాదాద్రికి వచ్చే భక్తులకు కల్పించే వసతులపై సీఎం కేసీఆర్ సమీక్ష జరిపే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం అందుతోంది.
ప్రధానంగా యాదాద్రి గర్భాలయంలో బంగారం తాపడం పనులు, కలశస్థాపన తదితర అంశాలపై సమీక్ష చేస్తారని సమాచారం అందుతోంది. ముక్యంగా యాదాద్రి పనులపై కేసీఆర్ దృష్టి సారించనున్నారు. ఇక ఇవాళ సాయంత్రం.. 4 గంటలకు హైదరాబాద్ తిరుగు ప్రయాణం కానున్నారు.