twitter poll result : ఆ విష‌యంలో కేసీఆర్ కే జై కొట్టిన నెటిజ‌న్ !

-

ఎన్నో పోరాటాల మధ్య తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది.తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి.. ఏదో ఒక రూపంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పోటీ కొనసాగుతూనే ఉంది.2014 నుంచి ఇప్పటి వరకు.. తగ్గేదే లే అన్నట్లుగానే రెండు రాష్ట్రాలూ అభివృద్ధిలో దూసుకుపోతున్నాయి.రెండుసార్లు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కేసీఆర్.. నీళ్లూ,నియామకాలూ,నిధులు అన్న ప్ర‌ధాన నినాదంతోనే ముందుకు సాగుతున్నారు.త‌మ రాష్ట్రానికి ఏదైనా అన్యాయం జరిగిందంటే.. ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నారు. ఏపీలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు..ప్రాజెక్టుల విషయంలో చాలా కఠినంగా వ్యవహరించారు సీఎం కేసీఆర్.చంద్రబాబును ఉక్కిరి బిక్కిరి చేస్తూ.. నీళ్ల విష‌య‌మై తెలంగాణకు వచ్చే వాటాను తెచ్చుకున్నారు.

అటుపై ఏపీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పటి నుంచి సీను పూర్తిగా మారిపోయింది.రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసికట్టుగా ముందుకు సాగుతున్నారు.కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఏపీ రాజకీయాలను డామినేట్ చేస్తున్నారు.సంక్షేమ పథకాలు తెచ్చినా,కీలక నిర్ణయాలు తీసుకున్నా ఆయ‌న రోల్ మోడల్ గా నిలుస్తున్నారు.దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ హీరో అయి పోతున్నారు సీఎం కేసీఆర్.అంతేకాదు సీఎం కేసీఆర్ కు ఏపీలో ఫ్లెక్సీలు క‌డుతూ, పాలాభిషేకాలు చేస్తున్నారు.దీంతో ఏపీలో ఏ రాజకీయ నాయకులకూ లేని ఫాలోయింగ్ కేసీఆర్కు వ‌చ్చింది. ఇందుకు సీఎం కేసీఆర్ మార్క్ పాలనే కారణం.

నిన్న సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ఉద్యోగాల ప్రకటన చేయడంతో.. ఏపీలో ఆయనకున్న ఫాలోయింగ్ మరింత పెరిగింది.తెలంగాణ నిరుద్యోగులతో పాటు ఏపీలోనూ నిరుద్యోగులు కేసీఆర్ నిర్ణయానికి ఫిదా అవుతున్నారు.తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను చూసి జగన్ నేర్చుకోవాలి అంటూ.. నిరుద్యోగుల నుంచి ప్రతిపక్ష నాయకులు వ‌ర‌కూ అంతా ఆయ‌న‌కు చురకలు అంటిస్తూ ఉన్నారు.ఈ నేపథ్యంలో ఉద్యోగాల భర్తీపై సీఎం కేసీఆర్ హిట్ అయ్యారా ? లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హిట్ అయ్యారా ? అనే అంశంపై మ‌న లోకం సైట్ సోషల్ మీడియాలో పోలింగ్ నిర్వహించింది.ఆన్ లైన్ ట్విట‌ర్ పోల్ లో 89 శాతం మంది సీఎం కేసీఆర్ కే ఓటు వేశారు. కేవలం 11 శాతం మాత్రమే సీఎం జగన్ కు ఓటు వేశారు.ఈ లెక్కన.. సీఎం జగన్ కంటే.. కేసీఆర్ కే నిరుద్యోగులలో ఫాలోయింగ్ ఉంది అన్నది నిర్థార‌ణ అయింది.నిరుద్యోగ బంధుగా కేసీఆర్ నిలిచిపోనున్నారు అన్న‌ది కూడా ఓ వాస్త‌వం.

Read more RELATED
Recommended to you

Latest news