ఆటోవాలా ఇంట్లో భోజనం చేసిన సీఎం….!

సీఎం లు అంటే స్టార్ హోటల్స్ లోనే బస చేస్తారు. ఇంట్లో తప్పితే ఫైవ్ స్టార్ హోటల్స్ లోనే భోజనం చేస్తారు. ఎన్నికల ప్రచారం కోసం భయటకు వెళ్ళినా ఏదైనా కార్యక్రమానికి వెళ్ళినా ఎమ్మెల్యేలు, మంత్రుల ఇళ్లలో తింటారు. కానీ తాజాగా సీఎం ఆటోడ్రైవర్ ఇంట్లో భోజనం చేసి అందరి దృష్టిని ఆకట్టుకున్నాడు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్ లోని లుతియానాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన స్థానికంగా ఓ ఆటో డ్రైవర్ లతో ముచ్చటించారు.

అనంతరం దిలీప్ తివారీ అనే ఆటో డ్రైవర్ సీఎం గారు మీరు చాలా మంది ఆటో డ్రైవర్ లకు సాయం చేశారు. ఈ పేద ఆటో డ్రైవర్ ఇంటికి భోజనం కు రాగలరా అంటూ ఆహ్వానించారు. దాంతో ఏమీ ఆలోచింకుండా కేజ్రీవాల్ అతడి ఇంటికి వెళ్లి అతడి కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేశాడు. దాంతో వారి ముఖాలు ఆనందం తో వెలిగిపోయాయి. ఇదిలా ఉంటే అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్ లో ఆప్ జెండా ఎగురవేసే దిశగా అడుగులు వేస్తున్నారు. గత ఎన్నికల్లో ఆప్ ప్రధాన ప్రతిపక్షం గా నిలవగా వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని చూస్తున్నారు.