నేడు కొడంగల్ కు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యం లో మహబూబ్ నగర్ పై స్పెషల్ ఫోకస్ చేశారు రేవంత్ రెడ్డి. ఈ ఒక్క నెలలోనే మహబూబ్ నగర్ జిల్లాకు 6 వ సారి రేవంత్ రెడ్డి వెళుతున్నారు. ఈ పర్యటనలో పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి హాజరు కానున్నారు సీఎం రేవంత్‌రెడ్డి.
ఇక ఇవాళ సాయంత్రం నాగర్ కర్నూల్ బహిరంగ సభ లో పాల్గొననున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక అటు రైతు రుణ మాఫీపై రోజుకో మాట మాట్లాడుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. బాసర సరస్వతి మందిరం మీద ఒట్టేసి చెప్తున్న ఆగస్ట్ 15 లోపల రైతులకి 2 లక్షల రుణమాఫీ మా ప్రభుత్వం చేస్తామని నిన్న నే ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. కానీ మంత్రులు మాత్రం ఏడాది పడుతుందని అంటున్నారు.