కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డి నివాసానికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లారు. దాదాపు అర గంటకు పైగా వీరిద్దరి మధ్య చర్చ జరిగినట్టు సమాచారం. ఎమ్మెల్సీ ఫలితాలు, క్యాబినెట్ సమావేశం నేపథ్యంలో వీరి భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. అంతకు ముందు సీఎం రేవంత్ రెడ్డిని వరంగల్-ఖమ్మం-నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా విజయం సాధించిన శ్రీపాల్ రెడ్డి కలిశారు.
తాజాగా సీఎం రేవంత్ రెడ్డి జానారెడ్డిని కలవడం పై రకరకాల ఊహగానాలు వినిపిస్తున్నాయి. ఓ వైపు తీన్మార్ మల్లన్న జానారెడ్డి చేయించిన సర్వే అని పదే పదే చెబుతున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలోనే సీఎం రేవంత్ జానారెడ్డిని కలవడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ వీరిద్దరి మధ్య మాత్రం దాదాపు అరగంట సేపు పలు విషయాలు చర్చకు వచ్చాయి.