12 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు స్టాలిన్ లేఖ

-

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ 12 రాష్ట్రాల సీఎంలకు లేఖ రాశారు. వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే జాతీయస్థాయి అర్హత ప్రవేశ పరీక్ష (నీట్‌)ను వ్యతిరేకిద్దామని పిలుపునిచ్చారు స్టాలిన్. రాజ్యాంగంలో పేర్కొన్న విధంగా విద్యా రంగంపై రాష్ట్రాల ప్రాముఖ్యతను పునరుద్ధరించడానికి రాష్ట్రాల ఐక్యతను కూడగట్టేందుకు లేఖ రాశారు.

బీజేపీ యేతర పాలిత రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ, జార్ఖండ్, మహారాష్ట్ర, పంజాబ్‌, రాజస్థాన్‌, పశ్చిమ బెంగాల్‌తో పాటు గోవా సీఎంలకు ప్రత్యేకంగా లేఖలు రాశారు స్టాలిన్. తమిళనాడులో మెడికల్ అడ్మిషన్‌లపై నీట్ ప్రభావంపై జస్టిస్ ఏకే రాజన్ కమిటీ నివేదికను అనువాదం చేసిన ప్రతితోపాటు నీట్‌కు వ్యతిరేకంగా తమిళనాడు ప్రభుత్వం ఇప్పటి వరకు చేపట్టిన ప్రయత్నాలను లేఖలో వివరించారు స్టాలిన్.

ఉన్నత విద్యా సంస్థల్లో అడ్మిషన్లు పొందడంలో గ్రామీణ ప్రాంత, సమాజంలోని అట్టడుగు వర్గాలకు చెందిన విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండేలా ఈ పత్రాలను పరిశీలించి నీట్‌ రద్దుకు మద్దతు అందించాలని 12 రాష్ట్రాల సీఎంలను ఆయన కోరారు తమిళ్ నాడు సీఎం.

Read more RELATED
Recommended to you

Latest news