ప్రస్తుతం ఏపీలో చంద్రబాబుకు పెద్ద సమస్య వచ్చిపడింది. ఈ వయసులో జనాల్లోకి ప్రత్యక్షంగా వెళ్లాల్సిన అవసరం ఏర్పడింది. ఆయన తన వయసుని, ఆరోగ్యాన్ని సైతం పక్కనపెట్టి పాదం కదపాల్సి వస్తోంది. ఇది కచ్చితంగా లోకేష్ లోపమే!!
తెలంగాణలో కూడా కేసీఆర్ కి ఇలాంటి సమస్యే ఉంది. 2018లో కేసీఆర్ ముందస్తుకు వెళ్లడానికి కూడా అదే కారణం అని అప్పట్లో కథనాలొచ్చాయి. ముందస్తుకి వెళ్లి.. ఆ తర్వాత మంత్రివర్గ కూర్పు విషయంలో కూడా కేటీఆర్ కి ప్రాధాన్యత ఇచ్చి.. మెల్లగా సీఎం ని చేద్దామని అనుకున్నారు! కానీ… రాజకీయ పరిస్థితులు సహకరించక తానే సీఎంగా కొనసాగుతున్నారు! సరిగ్గా బాబుకూడా ఇలానే ఆలోచిస్తున్నారు.
అవును… 2024 ఎన్నికలకు కూడా తనఫోటోతోనే వెళ్లాలని బాబు భావిస్తున్నారు. అందొస్తాడనుకున్న కొడుకు అసమర్థుడిగా మిగులుతున్నారనే బెంగో.. లేక, సక్సెస్ ఫుల్ స్టేజ్ లోనే రాజకీయాలనుంచి వైదొలగాలనే కోరికో తెలియదు కానీ… బాబు ఫిక్సయ్యారు! చరిత్రలో ఎరుగని ఓటమిని టీడీపీ ఎదుర్కొన్న సమయంలో.. ఇప్పుడు చినబాబుని నమ్ముకుంటే పనవదని ఫిక్సయైన బాబు.. రంగంలోకి దిగనున్నారు!
బద్వేల్ ఉప ఎన్నికను కూడా పక్కనపెట్టేశారు కాబట్టి.. ఇక నెలాఖరు నుంచి రంగంలోకి దిగి సార్వత్రిక ఎన్నికల కోసం కసరత్తులు చేయాలనుకుంటున్నారు చంద్రబాబు. 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో లోకేష్ కి పట్టాభిషేకం చేసి, ఆయన ఫేస్ తో ఎన్నికలకు వెళ్లాలనేది బాబు ఆలోచన! కానీ.. అందుకు ప్రజల సంగతి దేవుడెరుగు.. పార్టీలోనే వ్యతిరేకత వ్యక్తమయ్యింది. దీంతో ఆ ప్రయత్నాన్ని విరమించారు. తానే స్వయంగా రంగంలోకి దిగారు.
అందులో భాగంగా.. ప్రజాయాత్ర చేసి, టీడీపీకి పూర్వవైభవం తెచ్చి, అనంతరం కుమారుడికి పార్టీ అప్పగించి తాను స్మూత్ గా ప్రత్యక్ష రాజకీయాలనుంచి వైదొలగాలని భావిస్తున్నారంట!