సిఎం గారు… మీకు పదవి ఉండదు: ప్రజలకు అర్ధమైంది…!

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డియే విజయం సాధించిన సంగతి తెలిసిందే. మహాకూటమి త్రుటిలో విజయాన్ని చేజార్చుకున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో బీహార్ సిఎం నితీష్ కుమార్ ని ఉద్దేశించి ఆర్జెడి నేత మనోజ్ జా తీవ్ర వ్యాఖ్యలు చేసారు. సిఎం గారు మీ పదవి ఉండదు, ప్రజలకు మీ సినిమా అర్ధమైంది అంటూ విమర్శలు చేసారు. అంతే కాదు… మీరు అధికారంలో ఉండటానికి స్పష్టమైన మెజారిటీ లేదని ఆరోపించారు.

ప్రజలకు మీరు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేసారు. మూడో పార్టీగా నిలిచిన పార్టీ నేత ఏ విధంగా సిఎం అవుతారు అంటూ ప్రశ్నించారు. ఇప్పుడు, బీహార్ ప్రజలు మిమ్మల్ని విడిచిపెట్టరు అని ఆయన వార్నింగ్ ఇచ్చారు. నితీష్ కుమార్ శుక్రవారం తన రాజీనామాను రాష్ట్ర గవర్నర్ ఫాగు చౌహాన్ కు ఇచ్చారు.