ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం; ఆ ఇద్దరినీ ఒకేసారి పిలిచిన గవర్నర్…!.

-

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి వేదికగా రాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు వేడెక్కుతున్నాయి. ఎప్పుడు ఎం జరుగుతుందో అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఈ నేపధ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. మండలి చైర్మన్ షరీఫ్ ని, అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారం ని రాష్ట్ర గవర్నర్ బిశ్వ భూషణ్ హరి చంద్ ఆహ్వానించారు. రాజభవన్ లో ఇద్ద్దరితో ఆయన భేటి అయ్యారు.

ఇద్దరితో విడివిడిగా సమావేశం అయ్యారు. రాజధాని వికేంద్రీకరణ బిల్లు, సిఆర్దియే బిల్లుపై ఇద్దరితో ఆయన చర్చలు జరిపినట్టు తెలుస్తుంది. రాజధాని వికేంద్రీకరణ బిల్లు మండలిలో ఎందుకు వాయిదా పడింది అక్కడ చోటు చేసుకున్న పరిణామాలు ఏంటీ అనే దానిపై ఇద్దరినీ అడిగి తెలుసుకున్నట్టు తెలుస్తుంది. అలాగే మండలి చైర్మన్ గా షరీఫ్ కి ఉన్న అధికారాలను కూడా అడిగి తెలుసుకున్నారు.

కీలక సమయంలో జరిగిన ఈ భేటీ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రాష్ట్ర రాజకీయాల్లో ఎం జరుగబోతుంది అనేది అందరు ఎదురు చూస్తున్నారు. ఇద్దరు కూడా చట్ట సభల్లో ఎం జరిగింది బిల్లు ప్రవేశ పెట్టిన సమయంలో చోటు చేసుకున్న పరిణామాలు ఏంటీ అనేది వివరించారు. శనివారం సాయంత్రం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గవర్నర్ ని కలిసి చర్చలు జరిపిన తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news