జ‌గ‌న్ మ‌ళ్లీ సంచ‌ల‌నానికి రెడీ అయ్యాడుగా…

-

ఇటీవ‌ల గ్రామ స‌చివాల‌య ఉద్యోగులు అవినీతికి పాల్ప‌డిన నేప‌థ్యంలో గ్రామ వాలంటరీ వ్య‌వ‌స్థ బ్ర‌ష్టు ప‌ట్ట‌కుండా ఏపీ సీఎం జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి ఓ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకోబోతున్నార‌ట‌. సీఎం జ‌గ‌న్ అవినీతి నిర్మూల‌న పెద్ద పీట వేస్తున్న నేప‌థ్యంలో గ్రామ వాలంటీర్లు అవినీతికి పాల్ప‌డుతున్న ఆరోప‌ణ‌లు వ‌స్తున్న త‌రుణంలో సీఎం వాలంటీరీ వ్య‌వ‌స్థ‌ను అవినీతి లేనివిధంగా త‌యారు చేయాల‌ని భావించి ఓ కీల‌క నిర్ణ‌యం తీసుకోబోతున్నార‌ట‌. గ్రామ వాలంటీర్ల‌కు వేత‌నాలు స‌రిపోక‌పోవ‌డంతో అవినీతికి పాల్ప‌డుతున్నారని గ్ర‌హించిన సీఎం జ‌గ‌న్ వెంట‌నే న‌ష్ట నివార‌ణ  చ‌ర్య‌ల‌కు ఉప‌క్ర‌మించారు.

గ్రామ వాలంటీర్లు అవినీతికి పాల్ప‌డితే స‌ర్కారుకు చెడ్డ పేరు వ‌స్తుందని భావించిన సీఎం జ‌గ‌న్ వేత‌నాలు పెంచాల‌ని నిర్ణ‌యించార‌ట‌. అందుకు ఈరోజు రాష్ట్ర గ్రామ వాలంటీర్ల ప్రధాన కార్యదర్శితో సీఎం సమావేశం నిర్వహించి గౌరవవేతనం పెంచాలని నిర్ణయించుకున్నారట‌. ఇప్పుడు గ్రామ వాలింటర్లకు నెల‌కు రూ.5వేలు చెల్లిస్తుంది స‌ర్కారు. అయితే ఈ వేత‌నంను రూ.5వేలు నుంచి రూ. 8వేలకు పెంచేందుకు సీఎం జ‌గ‌న్ సుముఖంగా ఉన్నార‌ట‌. గ్రామ వాలంటీర్లు ఆగస్టు 15వ తేదీ నుంచి విధుల్లో చేరగా వారికి సెప్టెంబర్ 30వ తేదీ వరకు జీతాన్ని ప్రభుత్వం అక్టోబర్ 1వ తేదీన చెల్లించింది.

రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1,92,848 మంది వాలంటీర్లకు గాను 1,85,525 మంది వాలంటీర్లు విధుల్లో ఉన్నారు. 1,50,621 మందికి అక్టోబర్ 1వ తేదీన గౌరవ వేతనం 7వేల 500 రూపాయలు పంచాయతీ రాజ్ శాఖ జమ చేసింది. అయితే ఇప్పుడు అలవెన్సులతో కలుపుకుని వారికి రూ. 8వేలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుందట. వేత‌నాలు పెంచితే వాలంటీర్లు కూడా ఎలాంటి అవినీతికి పాల్ప‌డ‌కుండా స‌ర్కారు ఆలోచ‌న‌కు అనుగుణంగా ప‌నిచేస్తార‌ని సీఎం భావిస్తున్నారు.

గ్రామ స్థాయిలో అవినీతి మొద‌లైతే అది తీవ్ర ప్ర‌భావం చూపుతుంద‌ని, త‌ద్వారా ప్ర‌భుత్వానికి చెడ్డ పేరు రావ‌డం ఖాయ‌మ‌ని, ప్ర‌తిప‌క్షాల‌కు ఇది ఒక ఆయుధంగా మారుతుంద‌ని, స‌ర్కారుపై వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మై పార్టీ ప‌త‌నం అవుతుందని, తాను అనుకున్న ల‌క్ష్యం నెర‌వేర‌ని సీఎం జ‌గ‌న్ ముందుగానే గ్ర‌హించి వేత‌నాలు పెంచాల‌ని నిర్ణ‌యించార‌ట‌.. ఏదేమైనా సీఎం జ‌గ‌న్ వేత‌నాలు పెంచితే గ్రామ‌స్థాయి నుంచే అవినీతిని అరిక‌ట్టడం సాధ్య‌మ‌వుతుంది లేకుంటే ఏపీ సీఎం జ‌గ‌న్ కు ఈ వాలంటరీ వ్య‌వ‌స్థ‌తోనే ప‌త‌నం త‌ప్ప‌దని రాజ‌కీయ ప‌రిశీల‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news