రేపు పోలవరానికి సీఎం వైఎస్‌ జగన్‌..

రేపు ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పోలవరం పర్యటనకు వెళ్లనున్నారు. పోలవరం ప్రాజెక్ట్‌ పనుల పురోగతిని ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ క్షేత్రస్ధాయిలో పరిశీలించనున్నారు. ఈ పరిశీలనలో వెల్లడైన అంశాల ఆధారంగా జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. గడువులోగా ప్రాజెక్ట్‌ను పూర్తిచేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేస్తారు.

సీఎం జగన్‌ పోలవర్ పర్యటన షెడ్యూల్‌ వివరాలకు వస్తే.. ఉదయం 10.10 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరనున్న సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి…. 11.10 గంటల నుంచి 12 గంటల వరకు పోలవరం ప్రాజెక్ట్‌ పనులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేయనున్నారు.

ఆ తర్వాత… 12 గంటల నుంచి 1 గంట వరకు ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు సీఎం జగన్‌. తదనంతరం… 2.20 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకోనున్నారు సీఎం. ఇక సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి పర్యటన నేపథ్యంలో పోలవరంలో అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు అధికారులు. సీఎం పర్యటనలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు.