రేపే రైతుల ఖాతాల్లో 1600 కోట్లు జమ : కొడాలి నాని

తాడేపల్లి : ధాన్యం కొనుగోళ్ళకు డబ్బులు ఇవ్వడం లేదని చంద్రబాబు విమర్శిస్తున్నారని… చంద్రబాబు గత ఐదేళ్ల పాలనలో ఏడాదికి సగటున 55 లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారని ఫైర్‌ అయ్యారు మంత్రి కొడాలి నాని. మేము వచ్చిన తర్వాత సగటున ఏడాదికి 83 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నామన్నారు. ఏడాదికి సగటున 8,500కోట్లు ధాన్యం కొనుగోళ్ళకు చెల్లిస్తే..మేము వచ్చిన తర్వాత ఏడాదికి 1600 కోట్లు చెల్లిస్తున్నామని వెల్లడించారు.

అందుకే రైతులు కొట్టిన చావు దెబ్బకు టీడీపీ 23 స్థానాలకు పరిమితం అయ్యిందని చురకలు అంటించారు.  రైతులకు సోమ, మంగళ వారాల్లో 1600 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నామని… ఈ నెలాఖరు లోపు రైతులకు మొత్తం బకాయిలు చెల్లించాస్తామని హామీ ఇచ్చారు. 3, 390 కోట్లు బకాయిలు ఉన్నాయని… తెలిపారు. చంద్రబాబు ఎప్పుడైనా 21 రోజుల్లో ఒక రైతుకు అయినా ఐదు రూపాయలు చెల్లించారా?? కేంద్రంలో అధికారంలో ఉన్న సోము వీర్రాజు, జీవీఎల్ ఆరోపణలు చేయటం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. ఎవరైనా మంత్రికి ఇల్లు కట్టించి ఇచ్చారనే సమాచారం ఉంటే పోలీసులకు ఇస్తే విచారణ చేస్తారని… లేదంటే కేంద్రంలో వాళ్ళ ప్రభుత్వమే ఉంది కనుక సీబీఐ తో విచారణ చేయించుకోవచ్చని బీజేపీకి చురకలు అంటించారు.