జగన్ సర్కార్ గుడ్ న్యూస్ : 3.7 లక్షల మందికి లబ్ది

ఏపీ ప్రజలకు జగన్ సర్కార్ మరో గుడ్ న్యూస్ చెప్పింది. రేపు “జగనన్న తోడు పథకం” కింద సీఎం వైఎస్ జగన్ నగదు జమ చేయనున్నారు. తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో నగదు బదిలీ చేయనున్నారు సీఎం జగన్. ఈ పథకం కింద చిరు వ్యాపారులకు రూ.10 వేల వరకు వడ్డీ లేని రుణం ఇవ్వనుంది సర్కార్. వరసగా రెండో ఏడాది కూడా ఈ పథకాన్ని అమలు చేయనుంది ఏపీ సర్కార్. ఈ పథకం ద్వారా 3.7 లక్షల చిరు వ్యాపారులకు లబ్ది జరుగనుంది.

ఈ పథకం కోసం రూ.370 కోట్లు వెచ్చించనుంది ఏపీ ప్రభుత్వం. ఈ పథకం ద్వారా తీసుకున్న రుణాన్ని తిరిగి 12 ఈఎంఐల్లో లబ్దిదారులు చెల్లించాల్సి ఉంటుంది. రూ.10 వేల రుణానికి ప్రతి నెల వడ్డీని కూడా లబ్దిదారులు చెల్లించాలి. అయితే ప్రతి మూడు నెలలకు ఆ వడ్డీని సర్కార్ తిరిగి లబ్దిదారుల ఖాతాల్లో జమ చేస్తోంది. దీనికి ఎలాంటి ష్యూరిటీ అవసరం లేదు.