విద్యుత్ సంక్షోభంపై కేంద్ర మంత్రులతో అమిత్ షా భేటీ..

విద్యుత్ బొగ్గు సంక్షోభం దేశాాన్ని వణికిస్తోంది. కరోనా అనంతరం పారిశ్రామిక రంగం ఊపందుకోవడంతో విద్యుత్ డిమాండ్ గణనీయంగా పెరిగింది. దీనికి అనుగుణంగా డిమాండ్ కు సరిపడా బొగ్గు సప్లై లేకపోవడంతో రానున్న కాలంలో దేశంలో విద్యుత్ తిప్పలు తప్పకపోవచ్చనే వాదన వినిపిస్తోంది. తాజాగా విద్యుత్ సంక్షోభాన్ని అరికట్టేందుకు కేంద్రం సిద్ధమైంది. ఇందులో భాగంగానే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్, కోల్ మినిస్టర్ ప్రహ్లద్ జోషితో భేటీ అయ్యారు.

 దేశంలో ప్రస్తుతం బొగ్గ నిల్వలు, కొరత గురించి సమావేశంలో చర్చించారు. వీరితో పాటు ఎన్టీపీసీ ఉన్నత అధికారులు కూడా హాజరయ్యారు. ప్రస్తుతం దేశంలో 7.9 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయని నాలుగు రోజులకు సరిపోతాయని ఆదివారం కేంద్ర మంత్రి తెలిపారు. మరోవైపు ఢిల్లీ, పంజాబ్, ఏపీ రాష్ట్రాలు తీవ్రమైన బొగ్గు కొరతతో ఇబ్బందులు పడుతున్నాయని ఆయా రాష్ట్రాల సీఎంలు కేంద్రం ద్రుష్టికి తీసుకెళ్లారు.