Koffee with Karan సమంత,అక్షయ్‌ కుమార్‌ రచ్చ రచ్చ.. పెళ్లి, విడాకుల‌ గురించి ఏమన్నదంటే?

-

టాలీవుడ్‌ అగ్ర హీరోయిన్‌ సమంత.. ప్రస్తుతం దేశ సినీ ఇండస్ట్రీలో ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తమిళ్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ ముద్దుగుమ్మ తెలుగులో ఏ మాయ చేసావే అనే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఈ సినిమాతో ప్రేక్షకుల గుండెలను మాయ చేసింది.

మొదటి సినిమాతోనే మంచి ఇమేజ్ ను సొంతం చేసుకున్న సమంత ఆ తర్వాత వరుస సినిమాలను చేస్తూ మరింత పాపులారిటీని సొంతం చేసుకుంది. అయితే కాఫీ విత్ కరణ్ సీజన్ 7 లో ఈసారి సమంత కూడా పాల్గొనడం విశేషం.

కాఫీ విత్ కరణ్ సీజన్ సెవెన్ ఫోర్త్ ఎపిసోడ్ లో అక్షయ్ కుమార్ తో కలిసి సమంత పాల్గొంది. తాజాగా ఈ ఎపిసోడ్ ప్రోమో విడుదలైంది. అక్షయ్ కుమార్… సమంతను చేతులపై మోసుకుని రావడం ఎపిసోడ్ కి హైలెట్ గా నిలిచింది. సమంత పెళ్లి గురించి మాట్లాడాలనుకున్న కరణ్ ను… సమంత మధ్యలోనే ఆపేసి కరనే అన్ హ్యాపీ మ్యారేజ్ కు కారణమని సీరియస్ గా చెప్పేసింది. తన ఫ్రెండ్ బ్యాచిలర్ పార్టీని నిర్వహిస్తే… ఏ ఇద్దరు హీరోలను డాన్స్ చేయడానికి పెడతావు అంటే రెండుసార్లు రణవీర్ సింగ్ పేరే చెప్పింది సామ్. అంతేకాకుండా సమంత మరియు అక్షయ్ కలిసి డాన్స్ పెర్ఫార్మెన్స్ లతో కూడా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైనట్లు ప్రోమో చూస్తే తెలుస్తుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news